|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ.3,100 టికెట్! నోలన్ ‘ది ఒడిస్సీ’ ధరలు చూస్తే జేబులకు చిల్లు పడుతుంది!

Published: 14-07-2026, 3:44 PM

క్రిస్టోఫర్ నోలన్ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలో ఐమాక్స్ సీటు ధర రూ.3,100 కాగా, ఢిల్లీలో రూ.2,500 వరకు ఉంది. మల్టీప్లెక్సులు ఈ అవకాశాన్ని వాణిజ్యపరంగా వాడుకుంటున్నాయి.

Key Points

1

క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' జులై 17న విడుదల కానుంది.

2

ముంబై పీవీఆర్ ఐకాన్ లో ఐమాక్స్ రిక్లైనర్ సీట్ రూ.3,100.

4

నోలన్ సినిమా పూర్తిగా ఐమాక్స్ 70mm ఫిలిం తో షూట్ చేశారు.

నోలన్ మార్క్ సినిమా.. ఐమాక్స్ లో మాత్రమే పూర్తి కిక్

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ .. మూస పద్ధతిలో పరిగెడుతున్న సినిమాని తనదైన స్క్రీన్ ప్లే తో మలుపులు దిప్పిన  క్రియేటివ్ డైరెక్టర్.సినిమా మామూలుగా కాదు మెదడుకు పని చెప్పేలాఉండాలన్నది ఈయన స్టైల్ . మెమెంటో (2000), ది ప్రెస్టీజ్ (2006), ఇన్సెప్షన్ (2010), ఇంటర్‌స్టెల్లార్ (2014), డన్‌కిర్క్ (2017), టెనెట్ (2020) ఇలా ప్రతి సినిమా ఆడియన్స్ కి ఒక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్.ఈ సినిమాలు చాలు .. ఈయన మార్క్ ఏంటో చెప్పడానికి . అలాంటి నోలన్ నుండి మరో సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర ఏ రేంజ్ హడావిడి ఉంటుందో చెప్పక్కర్లేదు.

ఇక గతేడాది నోలన్  దర్శకత్వంలోనే వచ్చిన ఓపెన్ హైమర్ బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ అంత ఇంతా కాదు.అలాంటి నోలన్ ‘ ది ఒడిస్సీ ’ అంటూ మరో సినిమాతో జులై 17న పలకరించడానికి రెడీ అయిపోయాడు. మ్యాట్ డామన్ , టామ్ హాలండ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారనే క్రేజ్ ఉన్నప్పటికీ నోలన్ సినిమా కాబట్టి థియేటర్లో విజువల్స్ మామూలుగా ఉండవని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్న మల్టీప్లెక్స్

ముంబైలో రూ.3,100.. ఢిల్లీలో రూ.2,500 టికెట్ ధరలు

అయితే ఆడియన్స్ లో ఉన్న ఈ క్యూరియాసిటీని థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ కమర్షియల్ గా వాడుకుంటే పనిలో పడ్డారు .ఈ సినిమాని కంప్లీట్ గా ఐమాక్స్ 70mm ఫిలిం కెమెరాతో షూట్ చేశాడట నోలన్.అంటే అసలైన కిక్ రావాలంటే ఐమాక్స్ స్క్రీన్ మీదనే చూడాలన్నమాట.ఇదిగో సరిగ్గా ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకుంటున్నారట మల్టీప్లెక్స్ వాళ్ళు .

ముంబైలోని ముంబైలోని పీవీఆర్ ఐకాన్ (లోయర్ పరేల్) మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ రిక్లైనర్ సీట్ ఏకంగా రూ. 3,100 ఫిక్స్ చేశారట.  ఏంటి షాక్ అయ్యారా? ఒక సినిమా టికెట్ ధరతో ఇల్లంతా హ్యాపీగా రేషన్ సామాన్లు కొనుక్కోవచ్చని లెక్కేస్తున్నారా.ఇక ముంబై సంగతి అలా ఉంటే ఢిల్లీలోని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని పీవీఆర్ ప్రియా , సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్స్ లో కూడా టికెట్లు 2,500రూపాయలు వరకు పలుకుతున్నాయట.

మల్టీప్లెక్స్ లాభాల ఆశ.. ఫ్యాన్స్ ఖర్చు భారం

పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ కొన్నారంటే ఆలెక్క వేరే

అలా అని మామూలు సీట్లో కూర్చుందాం అనుకున్నా వెయ్యి నుంచి 2000 వరకు ముట్ట చెప్పాల్సిందే.ఇక అదే సినిమా థియేటర్ కి వెళ్లి పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ కొన్నారంటే ఆలెక్క వేరే.అయితే ఇంతలా టికెట్ రేట్లు మండిపోతున్నా నోలన్ ఫ్యాన్స్  మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ఆరేట్లకే టికెట్లను ఎగబడి కొనడం ఇక్కడ గమనార్హం .ఇక ముంబై, ఢిల్లీ తో పోల్చుకుంటే మిగతా నగరాల్లో ఈ రేట్లు కాస్త తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది.బెంగళూరులోని మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్లు 1200 నుంచి 1950 మధ్యలో ఉంటే కోల్కతాలోరూ. 1,100 నుంచిరూ.1,240 వరకు ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే టికెట్ రేట్ల పై గవర్నమెంట్ కంట్రోల్ ఉండే చెన్నైలో మాత్రం ఐమాక్స్ లో ఎక్కువ లో ఎక్కువగా రూ. 508కే టికెట్  దొరకడం విశేషం.చెన్నై జనాలు తక్కువ రేట్లకే నోలన్ మాస్టర్ పీస్ ని ఎంజాయ్ చేస్తుంటే మిగతా సిటీల వాళ్ళు కుళ్ళుకుంటారు కాబోలు.ఏదేమైనా గ్రీక్ మైథాలజీ స్టోరీ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కి  ఎక్కడా తగ్గకుండా ఇండియాలో కూడా రికార్డ్  స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం పక్కా అని ఇప్పుడే లెక్క లేస్తున్నారు ట్రేడ్ పండితులు .చూడాలి మరి థియేటర్లో ఈ  సినిమా చూశాక నోలన్ చెప్పాలనుకుంది చెప్పింది ఎంతవరకు ఎక్కుతుందో!

నోలన్ సినిమా కోసం అభిమానులు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నా, టికెట్ ధరలు మాత్రం సామాన్య ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి. ఇది సినిమా అనుభవాన్ని ప్రభావితం చేస్తుందా అనేది చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.