|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నోరా ఫతేహి అందానికి కారణం ఇదే! ఆమె చెప్పిన అసలు సీక్రెట్!

Published: 24-12-2025, 3:01 PM
నోరా ఫతేహి అందానికి కారణం ఇదే! ఆమె చెప్పిన అసలు సీక్రెట్!
  • నోరా ఫతేహి తన అద్భుతమైన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు.
  • కపిల్ శర్మ షోలో ఆమె తన ఆహారపు అలవాట్లను (పాస్తా, అన్నం, పప్పు) పంచుకున్నారు.
  • తనకు కారు లేదని, ఆటో రిక్షాలోనే ప్రయాణిస్తానని నోరా చమత్కరించారు.
  • ప్రస్తుతం రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న కాంచన 4 సినిమాలో నటిస్తున్నారు.

బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్, డైలీ రొటీన్ వెల్లడించారు. కపిల్ శర్మ షోలో ఆమె తన ఆహారపు అలవాట్లు, ఆటో ప్రయాణం గురించి చమత్కరించారు. ఈ వివరాలతో పాటు నోరా కెరీర్, కాంచన 4 సినిమా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

నోరా ఫతేహి గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్

డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామల్లో నోరా ఫతేహి ఒకరు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో కపల్ శర్మ షోలో పాల్గొనప్పుడు నోరా ఫతేహి తన అందం, గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న సీక్రెట్ ను చెప్పింది. వైరల్ అవుతున్న వీడియోలో కపిల్ శర్మ.. నోరా మీ స్కిన్ ఇంత గ్లోయింగ్ గా ఉండటానికి కారణమేంటి? ఏం తింటారు? మీ డైలీ రొటీన్ ఏంటి? అని ప్రశ్నించారు.

ఇందుకు నోరా నవ్వుతూ సమాధానమిచ్చింది. తాను పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళదుంపలు తింటానని తెలిపారు. తనకు కారు లేదని, ఆటో రిక్షాలోనే జర్నీ చేస్తానంటూ చమత్కారంగా చెప్పారు. నోరా విషయానికొస్తే.. స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. బాట్లా హౌస్, స్ట్రీట్ డ్యాన్సర్ 3D, మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలతో నటిగా ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం నోరా.. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న కాంచన 4 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నోరా సౌత్ ఆడియన్స్ కు చేరువ కానున్నారు.

కపిల్ శర్మ షోలో నోరా వెల్లడించిన విషయాలు

కెరీర్, కాంచన 4 వివరాలు

నోరా ఫతేహి తన గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్, సింపుల్ లైఫ్ స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె కెరీర్ లో మరిన్ని విజయాలు సాధించి, కాంచన 4 సినిమాతో సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.