|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR దర్శకత్వంలో మెగాస్టార్! షాకింగ్ నిజం బయటపెట్టిన ఫిల్మ్ జర్నలిస్ట్! వైరల్ న్యూస్!

Published: 16-03-2026, 5:35 AM
NTR దర్శకత్వంలో మెగాస్టార్! షాకింగ్ నిజం బయటపెట్టిన ఫిల్మ్ జర్నలిస్ట్! వైరల్ న్యూస్!
  • చిరంజీవి కెరీర్ తొలినాళ్లలోనే ఎన్టీఆర్ తో కలిసి ‘తిరుగులేని మనిషి’లో నటించారు!
  • ‘తిరుగులేని మనిషి’ సినిమాకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
  • షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు అనారోగ్యం పాలవ్వడంతో ఎన్టీఆర్ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు.
  • చిరంజీవి, కైకాల సత్యనారాయణ మధ్య ఫైట్ సీన్ ను ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారట!

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించడమే కాదు.. ఎన్టీఆర్ మెగాస్టార్ ని డైరెక్ట్ కూడా చేశారు! ఈ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సినిమా ఏదో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరు కాంబినేషన్స్ కడతారో కూడా చెప్పలేము. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన సంఘటనలకు కొదవలేదు. ముఖ్యంగా వేర్వేరు తరాలకు చెందిన అగ్ర హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ ఎన్టీఆర్ ‌- మెగాస్టార్ చిరంజీవిది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి “తిరుగులేని మనిషి” సినిమాలో నటించారు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభ దశలోనే అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ప్రముఖులతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆ కాలంలో ఎన్టీఆర్ కు అప్పట్లో ఎంత ఫాలోయింగ్ ఉండేదో.. ఆతరువాత కాలంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా అంతకంటే ఎక్కువే ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఈ ఇద్దరు నటులు ప్రత్యేక స్థానం సంపాదించారు.

చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్ సీక్రెట్స్!

ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో నటించిన విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిరుగులేని మనిషి” సినిమాలో చిరంజీవి రెండో హీరోగా కనిపించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంలో మంచి విజయాన్ని సాధించింది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. “తిరుగులేని మనిషి” సినిమా 4వ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో దర్శకుడు కె రాఘవేంద్రరావు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యనట్లు సమాచారం. వైద్యులు ఆయనకు కనీసం ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షూటింగ్‌కు రావడం సాధ్యం కాలేదు.

షూటింగ్‌ను ఆపేసే పరిస్థితి వచ్చింది.. షూటింగ్ ఆపితే.. మళ్లీ నటీనటుల డేట్స్‌ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందరి డేట్స్ దొరుకుతాయన్న నమ్మకంలేదు. దాంతో.. ఈ విసయం స్వయంగా ఎన్టీఆర్ ముందుకు వెళ్లింది. ఆయన వెంటనే మెగా ఫోన్ పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. వారం రోజుల షూటింగ్‌ను డైరెక్ట్ చేయడానికి ముందు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా చిరంజీవి , విలన్ పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ మధ్య వచ్చే ఒక ఫైట్ సీన్‌ను ఎన్టీఆర్ చిత్రీకరించారని చెబుతున్నారు.

రాఘవేంద్రరావుకి ఏమైంది? అసలు నిజం ఇదే!

ఎన్టీఆర్‌కు దర్శకత్వం కొత్త కాదు. “సీత రామ కల్యాణం”, “గుళేబకావలి కథ”, “దాన వీర సూర కర్ణ”, “కుల గౌరవం”, “తాతమ్మ కల”, “వరకట్నం”, “చాణక్య చంద్రగుప్త”, “శ్రీ రామ పట్టాభిషేకం” వంటి పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమాలో కొంత భాగం దర్శకత్వం వహించారని సమాచారం.

ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్, చిరంజీవి అభిమానులకు ఇది నిజంగా ఒక పండుగలాంటి వార్త. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.