|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR, నీల్ మూవీలో అఖిల్ ట్విస్ట్ ఉందా? ఇది నిజమా? సూపర్ అప్డేట్!

Published: 27-02-2026, 5:35 AM
NTR, నీల్ మూవీలో అఖిల్ ట్విస్ట్ ఉందా? ఇది నిజమా? సూపర్ అప్డేట్!
  • తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీపై భారీ అంచనాలు!
  • అఖిల్ సినిమాలో ఉన్నాడనే వార్తల్లో నిజం లేదని తేల్చేసిన మూవీ యూనిట్.
  • ప్రస్తుతం తారక్‌పైనే నీల్ పూర్తి దృష్టి సారించారని సమాచారం.
  • మాస్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రం గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

డ్రాగన్ మూవీలో అఖిల్?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రాలలో డ్రాగన్ ఒకటి. తారక్ ఇందులో హీరోగా నటిస్తుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరికీ కూడా ఇండియా రేంజ్లో క్రేజ్ ఉండడం, ఈ సినిమా సూపర్ సాలిడ్ మాస్ సబ్జెక్టుతో తెరకెక్కుతూ ఉండడంతో ఈ కాంబోకి సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మధ్యకాలంలో ఓ వార్త వైరల్ అయింది.

క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

అదేమిటంటే ఈ సినిమాలో అఖిల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు, ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా కథ మొత్తాన్ని మలుపుతిప్పే విధంగా ఉంటుంది. సూపర్ ట్విస్ట్ తో ఆయన పాత్ర వస్తుందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. దానితో తారక్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. తమ హీరోతోపాటు ఇంకో హీరో ఈ సినిమాలో భాగం కావడం, ఆయనకు మంచి పాత్ర ఉంది అనడంతో ఈ సినిమా మరో స్థాయికి వెళుతుంది అని వారు భావించారు.

తారక్‌పైనే నీల్ ఫోకస్!

కానీ ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని డ్రాగన్ మూవీ యూనిట్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, అఖిల్ మంచి స్నేహితులు. వారిద్దరూ తరచూ కలుస్తూ ఉండడం వల్ల ఈ సినిమాలో ఆయన నటిస్తున్నాడు అని వార్త వచ్చి ఉండొచ్చు. అంతకుమించి డ్రాగన్ సినిమాలో ఏ హీరో భాగం కాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారు తారక్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు ఈ మూవీ యూనిట్ చూపినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.