
📌 Key Points
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం.. అంచనాలు ఆకాశాన్నంటేలా!
- దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైల్ మార్పు.. ఇకపై కలర్ఫుల్గా డ్రాగన్ సినిమా!
- డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డాన్సులు, డ్యూయెట్లు కూడా ఉంటాయట!
- ఎన్టీఆర్ అభిమానులకు పండగే.. ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ పెట్టడానికి సిద్ధం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం.
డ్రాగన్ మూవీ: ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్!
NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తన హీరోలకు ఇచ్చే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఎలివేషన్స్ గనక ఎన్టీఆర్ కి పడితే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. అందుకే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్(NtrNeel) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, డ్రాగన్ సినిమా విషయంలో అందరికీ ఒక అనుమానం ఉండేది. అదేంటంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఒక సమస్య ఉంది.
బ్లాక్ థీమ్ కి స్వస్తి.. కలర్ఫుల్ డ్రాగన్!
అదేంటంటే, ఆయన సినిమాలన్నీ బ్లాక్ థీమ్ తో ఉంటాయి. ఆయన మొదటి సినిమా ఉగ్రం నుంచి మొన్నటి సలార్ వరకు అన్ని సినిమాలు నలుపు రంగులోనే ఉంటాయి. హీరో వేసుకొనే కాస్టూమ్స్ కూడా నల్లగానే ఉంటాయి. ఇప్పుడు డ్రాగన్ కూడా అదే తరహాలో ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ, డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ తన శైలీని మార్చుకున్నాడట.
ఎన్టీఆర్ కోసం డాన్సులు, డ్యూయెట్లు!
ఈ సినిమా మొత్తం చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో డాన్సులు, డ్యూయెట్ సాంగ్స్ ఉండవు. కానీ, డ్రాగన్ సినిమాలో అవి కూడా ఉండనున్నాయట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విషయంలోను డిజప్పాయింట్ అవ్వకూడదు అని ఈ డెసిషన్ తీసుకున్నాడట ప్రశాంత్ నీల్. అయితే, ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ఇన్ పుట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. కాబట్టి, డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉండబోతుంది అని క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి, డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నమాట.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


