|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR : ఫుల్ యాక్షన్‌గా ‘సామ్రాజ్యం’.. ఇది ఇప్పటికే స్పెషల్ అంటూ ఎన్టీఆర్ పోస్ట్

Published: 17-10-2025, 1:14 PM
NTR : ఫుల్ యాక్షన్‌గా ‘సామ్రాజ్యం’.. ఇది ఇప్పటికే స్పెషల్ అంటూ ఎన్టీఆర్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్.. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ‘సామ్రాజ్యం’ సినిమా తెలుగు టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ధనుష్ ‘వడ చెన్నై’కి సీక్వెల్‌గా శింబు హీరోగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

Key Points

1

వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై' సీక్వెల్‌గా 'సామ్రాజ్యం' వస్తోంది.

2

శింబు (STR-49) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళంలో 'అరసన్' టైటిల్.

4

ప్రోమోలోని యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

‘వడ చెన్నై’ తర్వాత వెట్రిమారన్ కొత్త ప్రాజెక్ట్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ సూపర్ హిట్ అందుకుంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. తాజాగా వడ చెన్నైలో ఎవరికీ తెలియని కథ అంటూ మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు వెట్రిమారన్. ఇందులో శింబు హీరోగా నటిస్తుండగా.. ప్రస్తుతం ‘STR-49’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ప్రోమోను టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తమిళంలో ‘అరసన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల చేస్తు్న్నారు. ఇక ప్రోమోను గమనిస్తే.. నెత్తుటి మ‌ర‌క‌ల‌తో ఓ వ్యక్తిని చంపేసి వెళ్లే క్రమంలో ఓ నీళ్ల కొలాయి ద‌గ్గర మ‌ర‌క‌ల‌ను క‌డుక్కోవాల‌ని ఆగుతాడు శింబు. ఆ స‌మ‌యంలో మ‌రింత మంది వ‌స్తారు. అక్కడితో టైటిల్ ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమోతో సినిమా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఉండబోతున్నట్లు అర్థం అవుతుండగా.. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతున్నది. లింక్

ఎన్టీఆర్ విడుదల చేసిన ‘సామ్రాజ్యం’ ప్రోమో

శింబు హీరోగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్

ఎన్టీఆర్ విడుదల చేసిన ‘సామ్రాజ్యం’ ప్రోమో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. శింబు స్టైలిష్ యాక్షన్, వెట్రిమారన్ మార్క్ దర్శకత్వం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.