
నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన అనుభవం ఉన్న సూర్యదేవర నాగవంశీ, ఎన్టీఆర్ ని దేవుడిగా చూపించాలని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ పౌరాణిక చిత్రం గురించి ఆయన ఇటీవల కొన్ని విషయాలు వెల్లడించారు.
Key Points
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో పౌరాణిక చిత్రం
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
2026 సెకండ్ హాఫ్ లో షూటింగ్ ప్రారంభం
'రామాయణం' సినిమా తర్వాత ప్రకటన వాయిదా
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో తదుపరి చిత్రం
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ (2018) ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా ΄పౌరాణికం నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్‌డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌గారు మా బ్యానర్‌లో తొలిసారి ΄పౌరాణికం నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.
నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్‌ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ‘రామాయణ’(రణ్‌బీర్ కపూర్) చిత్రం గ్లింమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేం చేయబోయే చిత్రం గురించి ‘రామాయణ’ కి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్‌గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.
సినిమా ప్రకటనకు కారణాలు
చిత్రీకరణ ప్రారంభ తేదీ
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే పౌరాణిక చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంపై అంచనాలు అత్యధికంగా ఉన్నాయి.


