జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కొన్ని కార్యకలాపాలపై ఆయన కార్యాలయం నుండి సంచలన ప్రకటన విడుదలైంది. “RAW NTR” సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, అభిమానులకు కీలక సందేశం పంపింది. ఈ తాజా అప్డేట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది!
Key Points
RAW NTR సంస్థతో ఎన్టీఆర్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం.
అధికారిక సమాచారం ఎన్టీఆర్, ఆయన బృందం నుండే వస్తుందని ప్రకటన.
అనధికార వార్తలను నమ్మవద్దని అభిమానులకు తారక్ ఆఫీస్ విజ్ఞప్తి.
రాజకీయ ప్రవేశంపై వదంతులకు ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఆఫీస్ ముగింపు.
RAW NTR: అసలు సంబంధం లేదా?
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, కార్యక్రమాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన విషయాలు ఏవైనా అధికారిక బృందం ద్వారా లేదా వ్యక్తిగతంగా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటించింది. అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ మంగళవారం (జులై 14) ఓ ప్రకటన విడుదల చేశారు. ”RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు” ”ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి” ”ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము. అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సహకారానికి, అలాగే ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు సినీ, రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. జూలై 18న తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఊరు-వాడ అనే పేరుతో ‘RAW NTR’ అనే సంస్థ నిర్వహించే కార్యక్రమంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఇప్పుడు NTR ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. ఆయనకు సంబంధంలేదని.. ఏ ప్రకటనైనా, కార్యక్రమమైనా తారక్ స్వయంగా ప్రకటిస్తారని తెలిపింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2027 జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు. దీనికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇది కుమారస్వామి కథతో రూపొందనుందని సమాచారం.
ఎన్టీఆర్ అధికారిక ప్రకటన వెనుక రహస్యం
ఫ్యాన్స్‌కి కీలక సూచన: నమ్మాల్సింది ఇదే!
ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ఈ కీలక ప్రకటనతో అనేక ఊహాగానాలకు తెరపడింది. ఫ్యాన్స్‌కు స్పష్టత లభించినప్పటికీ, భవిష్యత్తులో ఎన్టీఆర్ నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ వార్తల కోసం మా వెంట ఉండండి!


