
తెలుగు సినిమా అభిమానులకు షాకింగ్ వార్త! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయం కావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనకు 8 వారాల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. అసలు ఏం జరిగింది? ‘డ్రాగన్’ షూటింగ్ పరిస్థితి ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భుజానికి తీవ్ర గాయం, అభిమానులకు షాక్.
వైద్యుల సూచన: పూర్తి కోలుకోవడానికి 8 వారాల బెడ్ రెస్ట్ తప్పనిసరి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' షూటింగ్ లో ఉండగా ఈ దుర్ఘటన.
సినిమా విడుదలపై గాయం ప్రభావం, త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థన.
తారక్ భుజానికి గాయం: అసలు ఏం జరిగింది?
టాలీవుడ్ ని గాయాలు వెంటాడుతున్నాయి. మొన్న బాలయ్య గాయపడ్డారు. మరోవైపు రామ్ చరణ్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకు మణికట్టు ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. ఆయన ఈ రోజు(సోమవారం) సాయంత్రం గాయపడ్డారట. తాజాగా ఎన్టీఆర్ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఎన్టీఆర్ భుజానికి గాయమైందని, ఈ విషయాన్ని చెబుతున్నందుకు చింతిస్తున్నట్టు వెల్లడించారు.
8 వారాల బెడ్ రెస్ట్: అభిమానుల్లో ఆందోళన
`ఈ రోజు సాయంత్రం NTR భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం, ఆయన పూర్తిగా, సజావుగా కోలుకునేందుకు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తారక్ ఆరోగ్యం, కోలుకునేదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో తెలియజేస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు` అని టీమ్ వెల్లడించింది.
డ్రాగన్ షూటింగ్ పై ఎన్టీఆర్ గాయం ప్రభావం
అయితే ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను టీమ్ వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు తారక్. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. బహుశా ఈ మూవీ చిత్రీకరణలోనే ఆయన భుజానికి గాయమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని యావత్ తెలుగు సినిమా లోకం కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి స్పష్టత, ‘డ్రాగన్’ షూటింగ్ అప్డేట్స్ కోసం వేచి చూడాలి. మరిన్ని తాజా సమాచారం కోసం మా పేజీని అనుసరించండి.

