|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కూలీ’తో పోటీ.. బెట్‌ ఇలాంటి ‘వార్‌’ చూసి ఉండరు: ఎన్టీఆర్‌

Published: 26-06-2025, 5:15 AM

ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’ ఆగస్ట్ 14న విడుదలవుతోంది. అదే రోజు రజనీకాంత్ నటించిన ‘కూలీ’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వార్‌కు సన్నద్ధమవుతున్నాయి.

Key Points

1

ఆగస్ట్ 14న ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల.

2

ఎన్టీఆర్ ‘వార్ 2’ పై అంచనాలు పెంచుతూ ట్వీట్ చేశారు.

4

రజనీకాంత్ నటించిన ‘కూలీ’ కూడా అదే రోజు విడుదల.

‘వార్ 2’ విడుదల తేదీ ఖరారు

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ నిర్మించిన స్పై యాక్షన్‌ మూవీ ‘వార్‌’ (2019) కొనసాగింపుగా వార్‌ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.

ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

ఈ పోస్టర్లను ఎన్టీఆర్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.. ‘బెట్‌ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్‌’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం  ఎన్టీఆర్‌ ముంబైకి వెళ్లారు.

‘కూలీ’తో పోటీ తీవ్రం

కూలీతో పోటీ ఆగస్ట్‌ 14న వార్‌ 2 తో పాటు మరో భారీ పాన్‌ ఇండియా చిత్రం కూడా రిలీజ్‌ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్‌ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్‌ వార్‌లో గెలిదెవరో చూడాలి.

ఎన్టీఆర్ ‘వార్ 2’ మరియు రజనీకాంత్ ‘కూలీ’ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉత్కంఠగా ఉంది. ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.