
ప్రముఖ బాలీవుడ్ నటి నుష్రత్ బరుచ్చా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, అవకాశాల కొరతను బయటపెట్టింది. ఆమె అనుభవాలు లింగ వివక్షపై చర్చను రేకెత్తిస్తున్నాయి.
Key Points
నుష్రత్ బరుచ్చా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.
హిట్ ఇచ్చినా అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడింది.
షూటింగ్ సమయంలో హీరో కారవాన్ లోని టాయిలెట్ ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరించబడింది.
ఆమె అనుభవాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నుష్రత్ బరుచ్చా అనుభవాలు
Nushrratt Bharuccha : సినీ పరిశ్రమలో స్టార్స్ ని, మాములు నటీనటులు, ఒక్కోలాగా చూస్తారని తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా తాను స్టార్ అవ్వకముందు సినీ పరిశ్రమలో ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నుష్రత్ బరుచా మాట్లాడుతూ.. ఇక్కడ సినీ పరిశ్రమలో ఒక అబ్బాయి హిట్ కొడితే అతను నేపో కిడ్ అయినా బయటి వాడు అయినా అవకాశాలు బోలెడు వస్తాయి. కానీ ఒక అమ్మాయి హిట్ కొట్టినా కష్టాలు పడాల్సిందే. అవకాశాలు అంతగా రావు. హీరోలకు వచ్చినన్ని అవకాశాలు మాకు రావు. నేను 2011 నుంచి ఇక్కడ ఉన్నా. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశాను అని తెలిపింది.
బాలీవుడ్ లో లింగ వివక్ష
అలాగే.. ఓ సారి షూటింగ్ లో నాకు ఇచ్చిన కారవాన్ లో వాష్ రూమ్ బాగోకపోతే హీరో కారవాన్ వాడుకుందామని వెళ్ళాను. కానీ నన్ను వెళ్లనివ్వలేదు. అప్పుడు హీరో కూడా లేడు. ఒక 5 నిముషాలు వాష్ రూమ్ కి వాడుకుంటాను అన్నా వినలేదు. అప్పుడు నేను కంప్లైంట్ చేసే పొజిషన్ లో లేను. అప్పుడు ఇలాంటి సౌకర్యాలు అన్ని నేను కూడా ఏదో ఒక రోజుపొందుతాను అని నాకు నేను చెప్పుకున్నా అంటూ తెలిపింది. అయితే నుష్రత్ బరుచా చెప్పిన విషయాలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఆమెకు సపోర్ట్ గా కామెంట్ చేస్తుంటే పలువురు విమర్శలు చేస్తున్నారు.
ప్రేక్షకుల స్పందన
నుష్రత్ బరుచ్చా అనుభవాలు బాలీవుడ్ లోని లింగ వివక్షను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అయితే ఇది చర్చకు దారితీస్తుంది.


