|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఫీషియల్: సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Published: 05-05-2025, 5:11 AM
అఫీషియల్: సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘జాక్’ సినిమా థియేటర్లలో అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 8న విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు.

Key Points

1

సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'జాక్' సినిమా మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.

2

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల.

4

సుమారు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

‘జాక్’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారు

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మంచి హైప్ మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ స్పై యాక్షన్ కామెడీ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ జాక్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది.

జాక్ సినిమా మే 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషల్లో వస్తోంది.

ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

జాక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ నేడు (మే 5) అధికారికంగా ప్రకటించింది. “పాబ్లో నెరూడా.. పేరు పొయిటిక్‍గా ఉన్నా ప్రొఫెషన్ మాత్రం కాన్ఫిడెన్షియల్. జాక్ చిత్రాన్ని మే 8 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చూసేయండి” అని నెట్‍ఫ్లిక్స్ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ముందు నుంచి మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లు అనుకున్న రేంజ్‍లో రాలేదు. ఈ చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లనే సాధించింది. దీంతో డిజాస్టర్ రిజల్ట్ దక్కించుకుంది. టిల్లు చిత్రాలతో జోష్ మీద ఉన్న సిద్ధు కు జాక్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీకి ప్రమోషన్లను మూవీ టీమ్ బాగానే చేసింది. కానీ ప్లాఫ్ తప్పలేదు.

థియేటర్ల తర్వాత ఓటీటీ ప్రయాణం

జాక్ సినిమాలో సిద్ధుకు జోడీగా వైష్ణవి చైతన్య నటించారు. ఈ మూవీలో సిద్దు ఓ స్పై ఏజెంట్ పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్, బ్రహ్మజీ, రవిప్రకాశ్ కీరోల్స్ చేశారు. ఉగ్రవాదులను పట్టుకునే మిషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. లవ్ స్టోరీ, కామెడీ కూడా ఉంటాయి. ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేకపోయారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. స్టోరీ నుంచి నరేషన్ వరకు మిశ్రమ స్పందన దక్కింది. ఈ చిత్రంలో భాస్కర్ మళ్లీ ట్రాక్‍లోకి వస్తాడని పెట్టుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి.

జాక్ సినిమాను ఎస్‍వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. బాపినీడు సమర్పించారు. ఈ మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ సంగీత దర్శకులుగా పని చేశారు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేసిన చేసిన ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.

చివరగా, ‘జాక్’ సినిమా ఓటీటీ విడుదలతో సిద్ధు జొన్నలగడ్డ అభిమానులకు మరో అవకాశం లభించనుంది. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.