|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG ఫస్ట్ టికెట్ వేలం పాట: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారంటే?

Published: 04-09-2025, 2:49 AM
OG ఫస్ట్ టికెట్ వేలం పాట: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రీ-రిలీజ్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పుడు OG మొదటి టికెట్ వేలం విషయం తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

OG సినిమా ప్రీ-రిలీజ్ బుకింగ్స్‌లో అద్భుతమైన విజయం సాధించింది.

2

అమెరికాలో OG మొదటి టిక్కెట్ 5 లక్షలకు వేలం వెళ్లింది.

4

పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రేమ, OG సినిమాపై ఉన్న హైప్‌ను చూపిస్తున్నాయి.

అమెరికాలో భారీ ప్రీ-రిలీజ్ బుకింగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం OG పై Craze రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు ప్రీ రిలీజ్ బుకింగ్స్ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా నార్త్ అమెరికాలో.. పవర్ స్టార్ క్రేజ్ భయంకరంగా వర్కౌట్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, OG సినిమాకు అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ సినిమా 800,000 డాలర్లు అంటే సుమారుగా 6.6 కోట్ల వసూలు చేయడం గమనార్హం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మొత్తం 1 మిలియన్ డాలర్లు దాటిందంటున్నారు. అయితే అఫీషియల్ గా సమాచారం మాత్రం రావాల్సి ఉంది. అంతే కాదు ఇది తెలుగు సినిమాల ప్రీమియర్ బుకింగ్స్‌లో అరుదైన ఘనతగా చెబుతున్నారు.

OG మొదటి టికెట్ వేలం

ఇక పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మరో ప్రత్యేక కార్యకమం కూడా నిర్వహించారు. OG ఫస్ట్ టికెట్‌ను వేలం పాట ద్వారా విక్రయించగా, ఈ ఈవెంట్‌ను ట్విట్టర్ స్పేస్‌ ద్వారా నిర్వహించారు. ఈ వేలంపాటలో తెలుగు రాష్ట్రాలు, అమెరికాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చివరికి ఈ OG ఫస్ట్ టికెట్‌ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఏకంగా 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేస్తామని వారు ప్రకటించారు.

మూడు రోజుల్లో ఈ డబ్బును పార్టీకి అందిస్తామన్నారు టీమ్. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు ట్విట్టర్‌లో #OGFirstTicketAuction అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఒక్క సినిమా టికెట్‌కు లక్షల్లో ధర పలకడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.

జనసేనకు విరాళం

ఈ టికెట్ వేలంతో OG సినిమాపై ఉన్న హైప్ మరింతగా పెరిగింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, OG ట్రైలర్ విడుదల తేదీపై అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, ఆలస్యంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రేమకు OG సినిమా టికెట్ వేలం నిదర్శనం. 5 లక్షల రూపాయలకు వెళ్ళిన టికెట్, జనసేనకు విరాళంగా ఇవ్వడం అభిమానుల విశ్వాసాన్ని చూపుతుంది. సినిమా విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.