|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాషి యో వాషి సాంగ్ లిరిక్స్.. ఓజీలో పవన్ కల్యాణ్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఇదే!

Published: 22-09-2025, 1:26 AM
వాషి యో వాషి సాంగ్ లిరిక్స్.. ఓజీలో పవన్ కల్యాణ్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఇదే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాలోని ‘వాషి యో వాషి’ అనే జపనీస్ హైకూ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట లిరిక్స్ మరియు వాటి అర్థాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

వాషి యో వాషి లిరిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా జోడీ కట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్‌ రోల్ ప్లే చేశాడు.

ఓజీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న ఓజీ మూవీ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, పవన్ కల్యాణ్ తన సినిమాల్లో కొన్నిసార్లు పాటలు పాడి ఎంతో అలరించారు. వాటిలో కాటమరాయుడు సాంగ్, నారాజు గాకురా మా అన్నయ్య పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.

ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ ఓ పాట పాడారు. అదే జపనీస్ హైకూ (చిన్న కవిత) వాషి యో వాషి. జపనీస్ పదాలతో అల్లుకున్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో వాషి యో వాషి సాంగ్ లిరిక్స్, ఈ జపనీస్ హైకూ అర్థం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓజీ సినిమాలో విలన్ పాత్ర ఓమి (ఇమ్రాన్ హష్మి)కి వార్నింగ్ ఇస్తున్నట్లు ఈ సాంగ్ సాగుతుంది. “ఓమి మై డియర్ ఓమి.. ఎగరెగిరి పడుతున్నావ్.. నీలాంటి వాళ్లను నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు.. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతాను విను..” అని వాషి యో వాషి సాంగ్ ప్రారంభం అవుతుంది.

వాషి యో వాషి (WASHI YO WASHI)

యాసే నో వాషి ఓ కోరొసు నీ వా (Yasei no washi o korosu ni wa)

నువ్వో అడవి గద్దను చంపాలంటే..

జపనీస్ హైకూ అర్థం

మాజు తుసుబాస ఓ కిరి ఓటోసు హిట్సు యూ గా అరు (Mazu tsubasa o kiri otosu hitsu yoo ga aru)

నువ్వు ముందు దాని రెక్కలు తెగ నరకాలి..

జిమెన్ నీ ఓచితారా.. మేఓ ఎగురి దస్ (Jimen ni ochitara..me o eguri dasu)

అది నేల మీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి..

మె గా మియానకు నరి, దోకో నీ ఇకెబా ఈ నో క వకరా నాకు సురు (Me ga mienaku nari, doko ni ikeba ii no ka wakara naku suru)

ఒక్కసారి అది గుడ్డిదైతే… ఎటు పోవాలో దానికి తెలియదు..

ఓజీ సినిమాలో పాట ప్రాముఖ్యత

సోకోడే ఆషిఓ కిట్టే ఉగోకెనాకు సురు (Sokode ashi o kitte ugokenaku suru)

అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదల్లేదు…

సోషితే, యాసే నో షింజు ఓ గురి దాసు నోడా (Soshite, yasei no shinzou o eguri dasu noda)

అప్పుడు దాన్ని రాకాసి గుండెను బయటకు లాగాలి!

వాషి యో వాషి (WASHI YO WASHI)

ఇలా పవర్‌ఫుల్ మీనింగ్ వచ్చేలా వాషి యో వాషి సాంగ్‌ లిరిక్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఓజీ సినిమాలో శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ ఓజెస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు.

చివరగా, ఓజీ సినిమాలోని ‘వాషి యో వాషి’ పాట పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. పాట లిరిక్స్ మరియు అర్థం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.