|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG షూటింగ్‌కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్

Published: 02-06-2025, 9:41 AM
OG షూటింగ్‌కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా షూటింగ్‌కు విరామం. ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీకి తిరిగి వచ్చారు. ఇమ్రాన్ హష్మీ అనారోగ్యం కారణంగా ఈ విరామం ఏర్పడింది.

Key Points

1

పవన్ కళ్యాణ్ OG సినిమా షూటింగ్ ముంబైలో పూర్తి చేశారు.

2

ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ సోకినందున షూటింగ్‌కు విరామం.

4

OG సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

OG సినిమా షూటింగ్ వివరాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటినీ బాలన్స్ చేస్తూ.. కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా వాయిదా పడిన సినిమాల పనులు ప్రస్తుతం స్పీడ్ గా పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్, ప్రస్తుతం ‘OG’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరిగింది. పగలు, రాత్రి తేడా లేకుండా జరిపిన ఈ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పూర్తి ఎనర్జీతో పాల్గొన్నారు. ఇటీవల OG మూవీలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని లుక్‌లు ముంబైలో నుంచి లీక్ కావడం, వాటిపై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే.

ఇమ్రాన్ హష్మీ అనారోగ్యం

తాజాగా ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్, ఏపీకి తిరిగొచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఈ షూటింగ్‌లో పాల్గొనాల్సిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ సోకినట్టు సమాచారం. ఈ కారణంగా ఆయన షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ – ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ సన్నివేశాల కోసం ఇమ్రాన్ హష్మీ తిరిగి వస్తే తదుపరి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సినిమా విడుదల తేదీ

OG సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం OG సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా పవన్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తికాగానే ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు టీమ్.

ఇమ్రాన్ హష్మీ కోలుకున్న తర్వాత OG సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.