
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకే పెళ్లి చేసుకున్నవారికి మాత్రమే జీవించే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలని నొక్కి చెప్పారు.
Key Points
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ యూసీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఒకే పెళ్లి చేసుకున్నవారికి మాత్రమే జీవించే హక్కు ఉంటుందని అన్నారు.
వివిధ మతాలకు వేర్వేరు చట్టాలు ఉండకూడదని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు.
ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని, ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తారని హెచ్చరించారు.
యూసీసీపై సీఎం మోహన్ యాదవ్ వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలు గురించి భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకసారి పెళ్లి చేసుకున్నవాళ్లకు మాత్రమే జీవించే హక్కు ఉంటుందని అన్నారు. వివిధ మతాల ప్రజలకు వేరువేరు చట్టాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, కుటంబ విషయాలకు సంబంధించిన చట్టాలు పౌరులందరికీ సమానంగా ఉండాలని చెప్పారు. హిందువులకు, ముస్లింలకు చట్టాలు ఎందుకు వేరుగా ఉండాలి.. అందరికీ ఒకే చట్టం ఉండకూడదా అని ప్రశ్నించారు.
రామ్ తన జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటే రహీమ్ ను మూడు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎందుకు అనుమతించాలని ప్రశ్నించారు. ముస్లిం మహిళలు కూడా మన సోదరీమణులేనని, ఇప్పుడు ఒక్కసారి పెళ్లి చేసుకున్నవారికి మాత్రమే మధ్యప్రదేశ్ లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని, ఎవరైనా తలాక్, తలాక్, తలాక్ అంటే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ ఎంపీ సీఎం వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఒకే పెళ్లి చేసుకున్నవారికే జీవించే హక్కు?
మతాలకతీతంగా ఒకే చట్టం అవసరం
సీఎం మోహన్ యాదవ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా యూసీసీ అమలుపై చర్చను మరింత పెంచాయి. ఈ ప్రకటనలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి, భవిష్యత్తులో యూసీసీ అమలు దిశగా బీజేపీ అడుగులకు ఇవి సంకేతం.


