
తాజాగా సోషల్ మీడియాలో ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు ట్రెండ్ అవుతోంది. ఈ పేరుతో మెగాస్టార్ చిరంజీవి సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సిందూరం’ సినిమా కూడా ఈ చర్చకు కారణం అవుతోంది.
Key Points
ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో చిరంజీవి సినిమాపై చర్చ జోరుగా సాగుతోంది.
కృష్ణవంశీ దర్శకత్వంలోని ‘సిందూరం’ సినిమా ట్రెండింగ్‌లో ఉంది.
మెగా ఫ్యాన్స్ చిరంజీవితో ‘ఆపరేషన్ సిందూర్’ సినిమా కోరుకుంటున్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ సిందూర్ ట్రెండ్
ఆపరేషన్ సిందూర్ ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది. ఆర్మీ దళాల శక్తి హనుమంతుడితో పోల్చబడుతుంది. పాక్ కొంచెం ఎక్స్‌ట్రాలు చేసినా.. మరో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు ఇండియన్స్. అవసరమైతే బార్డర్‌కు వెళ్తామని దేశభక్తితో ఉప్పొంగిపోతున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్.. పెహల్గాం ఎటాక్‌లో భర్తలను కోల్పోయిన భారత స్త్రీలకు న్యాయం చేసేందుకు ఇచ్చిన హామీకి మారుపేరుగా పెట్టారు. ఇక ఈ సమయంలో తెలుగు సినిమా ‘సిందూరం’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఆయన ఆలోచనల్లో ఎంత ముందుచూపుందని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఈ ఆపరేషన్‌కు మోడీగారు మీ సినిమా పేరు పెట్టుకున్నారు కదా మీ ఆలోచనలను పంచుకోమని అడగ్గా.. ‘‘వందేమాతరం’’ అంటూ స్పందించారు డైరెక్టర్. ఇక హీరో రవితేజతో ‘ఖడ్గం 2’ తెరకెక్కించాలని ఆయన ఫ్యాన్స్ కోరగా.. మా బాస్ చిరంజీవితో ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో సినిమా తీయమని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
చిరంజీవి సినిమా అంచనాలు
కృష్ణవంశీ సిందూరం సినిమా
చిరంజీవి, కృష్ణవంశీ వంటి ప్రముఖుల పేర్లు ఈ టైటిల్‌తో ముడిపడి ఉండటం వల్ల ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో ఈ టైటిల్‌తో సినిమా వస్తుందో లేదో చూడాలి.


