
ఒప్పో లవర్స్‌కు శుభవార్త! Oppo Reno 15 Pro స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 200MP కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ వివరాలు తెలుసుకోండి.
Key Points
Oppo Reno 15 Proపై రూ. 14,500 వరకు భారీ తగ్గింపు.
200MP మెయిన్ కెమెరా, 6500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.
6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
విజయ్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లతో చౌకగా లభ్యం.
డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్
Oppo Reno 15 Pro : ఒప్పో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. కొత్త ఒప్పో ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై అద్భుతమైన డీల్స్ లభిస్తున్నాయి. ఒప్పో రెనో 15 ప్రోపై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా, 6400mAh బ్యాటరీ ఉన్నాయి. ఒప్పో రెనో 15 ప్రోను అసలు ధర కన్నా (Oppo Reno 15 Pro) చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఒప్పో ఫోన్‌లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
డిస్కౌంట్ ఆఫర్లు : ప్రస్తుతం ఒప్పో రెనో 15 ప్రో అతి చౌకైన ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్ ఈ ఒప్పో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 74,999 కాగా, విజయ్ సేల్స్ 9శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. దాంతో ఒప్పో రెనో 15 ప్రో ఫోన్ ధర రూ. 67,999కి తగ్గింది. అసలు ధర కన్నా రూ. 7వేలు చౌకగా లభిస్తుంది.
Oppo Reno 15 Pro స్పెసిఫికేషన్లు
Read Also : Upcoming Phones : కొత్త ఫోన్ కావాలా? జూలైలో రాబోయే టాప్ 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నథింగ్ నుంచి ఒప్పో రెనో వరకు..!
సేల్, బ్యాంక్ ఆఫర్ : బ్యాంక్ ఆఫర్‌తో ఒప్పో రెనో 15 ప్రో కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుతో ఈఎంఐలో కూడా కొనేసుకోవచ్చు. తద్వారా 7.5శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ. 7,500 వరకు ఆదా చేయొచ్చు. మొత్తంగా రూ.14,500 తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు.
కెమెరా, బ్యాటరీ వివరాలు
ఒప్పో రెనో 15 ప్రో స్పెసిఫికేషన్లు : ఒప్పో రెనో 15 ప్రో ఫోన్ 6.78-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
ఒప్పో రెనో 15 ప్రోలో కెమెరా సెటప్ మెయిన్ అట్రాక్షన్.. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరాతో రెండు 50MP, 50MP సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ అందిస్తుంది.
మొత్తంగా, Oppo Reno 15 Pro అద్భుతమైన ఫీచర్లు, భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులకు బెస్ట్ డీల్‌గా నిలుస్తుంది. కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.


