|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆస్కార్స్ 2026: సంచలనం సృష్టించిన విజేతలు! ఏ సినిమాకి ఎన్ని అవార్డులో తెలుసా?

Published: 16-03-2026, 1:35 AM
ఆస్కార్స్ 2026: సంచలనం సృష్టించిన విజేతలు! ఏ సినిమాకి ఎన్ని అవార్డులో తెలుసా?
  • 98వ ఆస్కార్ అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు 13 నామినేషన్లు.
  • ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ‘సిన్నెర్స్’ చిత్రానికి 16 నామినేషన్లు దక్కాయి.
  • ఉత్తమ సహాయ నటిగా ఏమీ మాడిగన్, ఉత్తమ సహాయ నటుడిగా సీన్ పెన్ అవార్డులు గెలుచుకున్నారు.
  • ‘ఫ్రాంకెన్ స్టైన్’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డులు లభించాయి.

ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నెర్స్’ చిత్రాలు అధిక నామినేషన్లు సాధించాయి. పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు గెలుచుకున్నారు.

ఆస్కార్ 2026: ప్రధానాంశాలు

Oscar Awards 2026: సినిమా ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం నేడు ఘనంగా సాగుతోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హాలీవుడ్ సహా ప్రపంచ సినీ పరిశ్రమ మొత్తం ఆస్కార్ అవార్డ్స్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే ..మరి ఈ ఏడాది అవార్డుల వేడుకలో పలు సినిమాలు ప్రధాన విభాగాలలో అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి ఇలా పలు విభాగాలలో ఆస్కార్ అవార్డులు వరించాయి. మరి 98వ అకాడమీ అవార్డ్స్ లో భాగంగా అవార్డ్స్ అందుకుంటున్న విజేతల గురించి ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే ఈ ఏడాది ముఖ్యంగా రెండు సినిమాలు నామినేషన్ల పరంగా ప్రత్యేకంగా నిలిచాయి. పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా 13 నామినేషన్లు సాధించగా, ర్యాన్ కూగ్లర్ రూపొందించిన సిన్నెర్స్ ఏకంగా 16 నామినేషన్లతో ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న సినిమాలుగా రికార్డులు సృష్టించాయి. ఇకపోతే ప్రస్తుతం అవార్డు వేడుక కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే కొన్ని విభాగాలలో విజేతలను ప్రకటించారు. ఇక అందులో ఇప్పటి వరకు ప్రకటించిన ఆస్కార్ 2026 విజేతల జాబితా ఇప్పుడు చూద్దాం..

ఉత్తమ సహాయ నటి – ఏమీ మాడిగన్ – వెపన్స్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కే పాప్ డిమోన్ హంటర్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – కేట్ హావ్లీ – ఫ్రాంకెన్ స్టైన్

నామినేషన్లలో ముందు వరుసలో నిలిచిన సినిమాలు

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – మైక్ హిల్, జోర్డాన్ శ్యామ్యూల్, క్లియోనా ప్యూరీ – ఫ్రాంకెన్ స్టైన్

ఉత్తమ కాస్టింగ్ డైరెక్టర్ – కసాండ్రా కులు కుండిస్ – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ సహాయ నటుడు – సీన్ పెన్

ఉత్తమ మ్యూజిక్ స్కోర్ – సిన్నెర్స్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం – మిస్టర్ నోబడి అగైనెస్ట్ పుతిన్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – ఆల్ ది ఎంప్టీ రూమ్స్

విజేతల పూర్తి జాబితా

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – అవతార్ : ఫైర్ అండ్ యాష్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – టమారా డెవరెల్ , షేన్ వూ – ఫ్రాంకెన్ స్టైన్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – పాల్ థామస్ అండర్సన్ – వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – ర్యాన్ కూగ్లర్ – సిన్నెర్స్

ఇలా ఈ విధంగా 98వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం సినీ ప్రపంచంలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్కార్ అవార్డు విజేతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Tags Hollywood oscar awards Share

ఈ విధంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక ఎన్నో విశేషాలతో ముగిసింది. విజేతలందరికీ అభినందనలు తెలుపుతూ, రాబోయే చిత్రాలకు శుభాకాంక్షలు తెలుపుదాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.