|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT: కమెడియన్ తీసిన సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్

Updated: 12-11-2025, 12:12 AM
OTT: కమెడియన్ తీసిన సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్

హీరో రాజ్ తరుణ్ నటించిన కొత్త ఓటీటీ చిత్రం ‘చిరంజీవ’ నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. ‘జబర్దస్త్’ ఫేమ్ అభి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

రాజ్ తరుణ్ నటించిన 'చిరంజీవ' చిత్రం నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానుంది.

2

'జబర్దస్త్' ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

4

గత కొన్ని చిత్రాలతో విజయాలు లేని రాజ్ తరుణ్ కు ఈ సినిమా ఆశలు రేపుతోంది.

రాజ్ తరుణ్ ఆశల “చిరంజీవ”

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. తర్వాత మూవీస్ అయితే తీశాడు గానీ ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు. గతేడాది ‘తిరగబడరా సామీ’ అనే చిత్రంతో వచ్చాడు గానీ ఫలితం మారలేదు. ప్రస్తుతం ‘చిరంజీవ’ అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.

జబర్దస్త్ అభి డైరెక్షన్: కథేంటి?

‘జబర్దస్త్’ ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు.. ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి?

ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?

మొత్తానికి, ‘చిరంజీవ’ సినిమా రాజ్ తరుణ్ కెరీర్‌లో మలుపు తిప్పుతుందా లేదా అనేది వేచి చూడాలి. జబర్దస్త్ అభి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్న కథా చిత్రం నవంబర్ 7న ఓటీటీలో అలరించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.