
📌 Key Points
- మమ్ముట్టి సైకో థ్రిల్లర్ మూవీతో సోనీ లివ్ షేక్!
- క్రైమ్ జర్నలిస్ట్ గా శోభిత ధూళిపాళ సంచలన ఇన్వెస్టిగేషన్!
- ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్ గా దుమ్మురేపే విన్యాసం!
- చంద్రయాన్ 3 సక్సెస్ స్టోరీతో జియో హాట్ స్టార్‌లో సైంటిస్టుల కష్టం!
ఓటీటీ ప్రియులకు ఇది పండగ లాంటి వార్త! మీకోసం టాప్ 5 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ల లిస్ట్ రెడీగా ఉంది. థ్రిల్లర్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఒకే చోట!
మమ్ముట్టి సైకో థ్రిల్లర్ తో దిమ్మతిరిగే ట్విస్ట్
ఓటీటీలో నిత్యం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఓటీటీలో కొన్ని అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. టాప్ 5 లిస్ట్ లో కొన్ని థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అదే విధంగా సైంటిస్ట్ ల కష్టాన్ని తెలియజేసే వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇది మమ్ముట్టి నటించిన సైకో థ్రిల్లర్ మూవీ. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నెగిటివ్ రోల్ లో సైకో పాత్రలో నటించారు. ఒంటరి మహిళలని ట్రాప్ చేసి, వాళ్ళని హోటల్ రూమ్ కి తీసుకువెళ్లడం, శారీరకంగా వారికి దగ్గర కావడం, ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చంపేసి పైశాచిక ఆనందం పొందే కథ ఇది.
ఎక్కడ చూడాలి: సోనీ లివ్ లో స్ట్రీమింగ్
మహిళల వరుస హత్యల నేపథ్యంలో ఈ ఓ క్రైమ్ జర్నలిస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ కథతో ఈ చిత్రం ఉంటుంది. క్రైమ్ జర్నలిస్ట్ గా శోభిత ధూళిపాళ నటించింది. సినిమా యావరేజ్ గా ఉన్నా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్ర సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో శోభిత సంచలన నిజాలు
ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
కులం, పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో దండోరా మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. శివాజీ నటన ఈ మూవీకే హైలైట్ తప్పనిసరిగా యువత చూడాల్సిన సినిమా ఇది.
ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇది. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎలా పనిచేస్తారు ? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి ? స్మగ్లర్స్ ని అడ్డుకునేందుకు వాళ్ళు ఎలా పనిచేస్తారు ? ఇలాంటి ఆసక్తికర అంశాలని చాలా థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. స్మగ్లర్లు చేసే జిమ్మిక్కులు, వాటిని అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు వేసే పైఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
సైంటిస్టుల కష్టాన్ని కళ్ళారా చూడండి!
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
అంతరిక్ష పరిశోధన, రాకెట్ లాంచింగ్ లాంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చంద్రయాన్ 2 వైఫల్యం తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల మానసిక స్థితి ఎలా ఉంది ? ఆ ఓటమిని అధికమించి చంద్రయాన్ 3 ప్రాజెక్టు ని ఎలా విజయపథంలో నడిపించారు అనే అంశాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఓటీటీలో రిలీజైన ఈ మూవీస్ అన్నీ సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతున్నాయి. మరెన్నో సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


