
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా నుంచి ‘ఫైర్ స్టార్మ్’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో అదిరిపోయే బీట్, పవర్ ఫుల్ లిరిక్స్, మరియు శింబు వోకల్స్ ప్రత్యేక ఆకర్షణలు.
Key Points
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా నుండి 'ఫైర్ స్టార్మ్' లిరికల్ సాంగ్ విడుదల.
అదిరిపోయే బీట్, పవర్ ఫుల్ లిరిక్స్ తో యూట్యూబ్ షేక్ చేస్తోంది.
తమన్, శింబు, మరికొందరు కలిసి పాడిన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది.
జపనీస్, ఇంగ్లీష్ లిరిక్స్ తో పాటు పవన్ కల్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలైట్.
‘ఫైర్ స్టార్మ్’ లిరికల్ సాంగ్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ ‘ఓజీ’పై అంచనాలను రెట్టింపు చేస్తూ ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియోను మూవీ టీమ్ ఇవాళ (ఆగస్టు 2) యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ లిరిక్స్ తో, అదిరిపోయే బీట్ తో ఈ సాంగ్ మరో లెవల్ లో ఉంది. ఓజీ నుంచి సాంగ్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్.. తమన్ ఇచ్చిన ఈ పాటకు ఊగిపోతున్నారు.
టర్న్ డౌన్ ది వైలైన్స్, టర్న్ అప్ ది మ్యూసిక్ అంటూ ఈ ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియో స్టార్ట్ అవుతుంది. ఓజీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. హీరోయిజాన్ని మరో లెవల్ లో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు. ‘ధేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజస్ గంభీర’ అంటూ ఇంగ్లిష్ లిరిక్స్ తో సాంగ్ సాగుతుంది.
పవర్ ఫుల్ లిరిక్స్ మరియు అద్భుతమైన బీట్
‘అలలిక కదలక భయపడేలే.. క్షణక్షణమొక తల తెగిపడేలే’ అంటూ పవర్ ఫుల్ గా సాగుతోంది ఈ సాంగ్. మధ్యలో ఫైర్ ఈజ్ కమింగ్ అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ‘పగ రగిలిన ఫైరూ’ అంటూ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ ను చెప్పే ప్రయత్నం చేశారు.
ఓజీ (ఓజస్ గంభీర) నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాను మరో లెవల్ కు తీసెకెళ్లేలా ఉంది. ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా సాంగ్ లో జపనీస్ లిరిక్స్ కూడా ఉన్నాడు. రప్ప బప్ప అంటూ సాగే ర్యాప్ కూడా హైలైట్ గా నిలిచింది. ఒకే సాంగ్ తో ఎస్ఎస్ తమన్ మరోసారి అదరగొట్టాడు. ఈ లిరికల్ వీడియోలో పవన్ కల్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా మరో రేంజ్ లో ఉన్నాయి. ‘ఓజీ ఓజీ యు బెటర్ రిమెంబర్ ది నేమ్’ అంటూ లిరిక్స్ ఫైర్ పుట్టించాయి.
శింబు వోకల్స్ హైలైట్
ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీకి సుజీత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ఫైర్ స్టార్మ్ సాంగ్ ను తమన్, నజీరుద్దీన్, భరత్ రాజ్, తమిళ స్టార్ హీరో శింబు, దీపక్ బ్లూ, రాజ కుమారి కలిసి పాడారు. శింబు వోకల్స్ స్పెషల్ గా నిలిచాయి. తెలుగు లిరిక్స్ ను విశ్వ, శ్రీనివాస మౌలి రాశారు. ఇంగ్లీష్ లిరిక్స్ ను రాజ కుమారి, జపనీస్ లిరిక్స్ ను అద్వితీయ వొజ్జల రాశారు. డ్రమ్స్ ను శివమణి పగిలేలా వాయించారు.
మొత్తం మీద, ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ ‘ఓజీ’ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. శింబు వోకల్స్ మరియు తమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


