|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరిహర వీరమల్లు నిర్మాతను ఆర్థికంగా ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

Published: 04-06-2025, 7:42 AM
హరిహర వీరమల్లు నిర్మాతను ఆర్థికంగా ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిర్మాతకు 11 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం.

Key Points

1

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిర్మాతకు 11 కోట్లు ఆర్థిక సహాయం అందించారు.

2

సినిమా రిలీజ్‌ను ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు తీసుకెళ్లాలని పవన్ సూచించారు.

4

నిర్మాత ఏ.ఎం.రత్నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సబంధించిన ఈమధ్య రోజుకో రూమర్ బయటకు వస్తుంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సుధీర్ఘకాలం సాగడంతో పాటు, ఆర్ధిక ఇబ్బందులు కూడా ఫేస్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో.. లైన్ లోకి జోత్యి కృష్ణ వచ్చాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో హరిహర వీరమల్లు” కూడా ఒకటి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పరిస్థితి ఏంటో అభిమానులకి అంతుపట్టడం లేదు. ఎప్పుడు షూటింగ్ అంటారో తెలియదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఆమధ్య హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ను ప్రకటించారు టీమ్. కాని ఇలా ప్రకటించారో లేదో.. అలా మరోసారి రిలీజ్ డేట్ మారినట్టు సమాచారం.

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకోసారి ఒకో ట్విస్ట్ తగులుతోంది. ఎప్పుడు ఏ ప్రకటన వస్తుందో తెలియకుండాపోయింది. హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ అయిపోయింద, పవన్ ఒక్క నైట్ లో డబ్బింగ్ కూడా చెప్పేశాడు. కాని ఇంకా పని ముందుకు సాగడంలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యనే మొదలయ్యాయి. కానీ ఇంతలోనే మళ్ళీ ఈసినిమా రిలీజ్ వాయిదా పడ్డట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈసినిమా నిర్మాత ఏ ఎం రత్నం హరిహర వీరమల్లు కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గానే ప్రమోషన్స్ ని కూడా తానే ముందుండి నడిపించారు. అయితే సడెన్ గా ఈ నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు అనే షాకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకున్న పవన్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం 11 కోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్చాడని తెలుస్తోంది.

నిర్మాత ఆర్థిక ఇబ్బందులు

అలాగే సినిమా రిలీజ్ ని ఎలాంటి ప్రెజర్ లేకుండా ముందు రిలీజ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈనెలలో(జూన్) రిలీజ్ అవ్వవలసిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సహాయం సినిమా విడుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.