|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan: వీరమల్లు విడుదలకు తొలగిన అడ్డంకులు.. ఇక అదొక్కటే బాకీ!

Published: 11-06-2025, 9:15 AM
Pawan Kalyan: వీరమల్లు విడుదలకు తొలగిన అడ్డంకులు.. ఇక అదొక్కటే బాకీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సంబంధించి తాజా సమాచారం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయి, రిలీజ్ డేట్ ప్రకటనకు సిద్ధమవుతున్నారు.

Key Points

1

హరిహర వీరమల్లు సినిమా VFX పనులు పూర్తయ్యాయి.

2

ట్రైలర్ విడుదల త్వరలోనే జరగనుంది.

4

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

వీరమల్లు VFX పనులు పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం తాను మధ్యలో ఆపేసిన సినిమా షూటింగ్స్‌ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. కమిటైన చిత్రాల్లో ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కిస్తుండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు, ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబి డియోల్, సునీల్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఈనేపథ్యంలోనే మూవీమేకర్స్ ‘హరిహరివీరమల్లు’ మూవీని జూన్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో మరోసారి వాయిదా పడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా 12న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాను జూన్ 26కు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘హరిహరి వీరమల్లు’ విడుదల విషయంలో అన్ని అడ్డంగులు తొలగినట్లు టాక్. ఈ మూవీకి సంబంధించిన ‘హరిహర వీరమల్లు’ VFX వర్క్ పూర్తి అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలో ట్రైలర్ తో పాటుగా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ట్రైలర్ విడుదలకు సిద్ధం

విడుదల తేదీ ప్రకటన

హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. ట్రైలర్ తో పాటు విడుదల తేదీ త్వరలోనే వెల్లడించబడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.