
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజాగా VFX పనులు పూర్తయినట్లు సమాచారం అందుతోంది.
Key Points
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయింది.
VFX వర్క్స్ పూర్తి అయింది, విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.
సినిమాలోని ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలైట్‌గా ఉంటుందని వార్తలు.
ట్రైలర్ మరియు విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
షూటింగ్ పూర్తి, VFX పనులు పూర్తి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు ఒకటి. దీనిని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించగా, ఏఎమ్ రత్నం(AM Ratnam) నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీనే విడుదల చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల నిలిచిపోయింది. కానీ ఇంకా కొత్త తేదీ మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడుదల వాయిదాకు కారణమైన VFX వర్క్స్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతేగాకుండా.. ఈ సినిమాలో ప్రీ ఇంటర్నెల్ సీన్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం VFX వర్క్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కావడంతో విడుదలకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఇక ట్రైలర్ అండ్ రిలీజ్ అప్డేట్ ఇవ్వడమే మిగిలి ఉంది. ఈ వార్త తెలిసిన అభిమానులు త్వరగా అప్డేట్ ఇవ్వండి బ్రో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ కీలక పాత్ర పోషించారు.
💥💥🦅🦅HARI HARA VEERA MALLU🦅🦅💥💥 💥💥PAWAN KALYAN 💥💥 pic.twitter.com/3TWOMhZtsp
విడుదలకు అడ్డంకులు తొలగింపు
ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలైట్
హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. VFX మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ట్రైలర్ మరియు విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


