
📌 Key Points
- పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్, మోహన్ రాజా కాంబో మూవీ!
- `ఉస్తాద్ భగత్ సింగ్` తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ సినిమా ఆలస్యం!
- రాజా సాబ్‌తో వచ్చిన నష్టాన్ని పవన్ సినిమాతో భర్తీ చేయాలని నిర్మాత ప్రయత్నాలు!
- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి పనిచేయనున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారా? తమిళ దర్శకుడితో కలిసి పవన్ కళ్యాణ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మోహన్ రాజా దర్శకత్వంలో పవన్ మూవీ?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంతో రాబోతున్నారు. హరీష్ శంకర్ రూపొందించిన ఈ చిత్రం ఈ ఉగాదికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో పవన్ నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రామ్ తళ్లూరి దీనికి నిర్మాత. ఈ మూవీకి ఇంకా ప్రారంభం కాలేదు. ఈక్రమంలో మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
తమిళ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. చిరంజీవితో `గాడ్ ఫాదర్` మూవీ చేసిన మోహన్ రాజాతో పవన్ మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఇటీవలే మోహన్ రాజా.. పవన్ కళ్యాణ్ ని కలిశారని, స్క్రిప్ట్ నెరేట్ చేయగా, ఆయన ఆసక్తి చూపించారని టాక్. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని అంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ చేస్తుందట.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ప్లాన్!
ఆ మధ్య `ది రాజా సాబ్` మూవీ ఫ్లాప్ తర్వాత.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తాము కలిసి పనిచేయబోతున్నట్టు తెలిపారు. పవన్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా ట్వీట్ చేసింది. దీంతో నిర్మాణంలో వీరిద్దరు భాగస్వామ్యంతో సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మోహన్ రాజా దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. వైరల్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. `ది రాజాసాబ్`తో వచ్చిన నష్టాలను పవన్ మూవీతో భర్తీ చేసుకోవాలని నిర్మాత భావిస్తున్నట్టు టాక్.
సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్?
ఇక `ఉస్తాద్ భగత్ సింగ్` తర్వాత పవన్.. సురేందర్ రెడ్డితో సినిమా చేస్తారు. అయితే ఇది ఇంకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఫైనల్ స్క్రిప్ట్ కూడా ఇంకా నెరేట్ చేయలేదు. ఇంకా ఆ వర్క్ జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడు టైమ్ ఇస్తారు? ఎప్పుడు మూవీని పూర్తి చేస్తారనేది పెద్ద సస్పెన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌తో సినిమా అంటే షూటింగ్ స్టార్ట్అయ్యేంత వరకు క్లారిటీ లేదనే చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్, మోహన్ రాజా కాంబో మూవీ గురించిన ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. పవర్ స్టార్ ఫాన్స్ కు పండగే!


