
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
- ఉగాదికి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
- పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పష్టత ఇచ్చింది.
- ప్రస్తుతం కొత్త సినిమా కమిట్మెంట్స్ ఏమీ లేవని, ఓజి 2 గురించి త్వరలో సమాచారం ఇస్తామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తదుపరి సినిమాల గురించి వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. కొత్తగా ఏ సినిమాకు కమిట్ కాలేదని స్పష్టం చేసింది. ఓజి 2 అప్డేట్ త్వరలో ఇస్తామని తెలిపింది.
పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు
Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన గతంలో కమిట్ అయిన సినిమాల షూటింగ్లో పూర్తిచేసి ఆ సినిమాలను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇటీవల ఉగాది పండుగను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ తో తదుపరి సినిమాల గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే సుజిత డైరెక్షన్ లో ఓజి 2 సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా ఈయన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పొలిటికల్ జానర్ లో దర్శకుడు దేవా కట్ట డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన టీం ఈ వార్తల పై స్పందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారక సోషల్ మీడియా ఖాతా నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఆయన కొత్త సినిమాలపై వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని స్పష్టత ఇచ్చారు.. ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని టీం క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఓజి 2 అప్డేట్ గురించి తెలియజేస్తూ సరైన సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా గురించి సమాచారం ఇస్తారని తెలిపారు.
కొత్త సినిమాలపై టీమ్ ప్రకటన
As of now, Sri @PawanKalyan garu has not taken up any new film commitments. Speculations about ongoing projects are not accurate.
At present, there are no immediate plans to commence new films. Any developments will be communicated through official channels when ready.
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) March 23, 2026
ఓజి 2 అప్డేట్ ఎప్పుడు?
సురేందర్ రెడ్డి డైరెక్షన్లోనూ, దేవా కట్ట డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు ఉండబోతున్నాయి. అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని ఈ సందర్భంగా స్పష్టత రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓజి 2 కచ్చితంగా ఉండబోతుందని పవన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని చెప్పాలి. ఈ సినిమా రొటీన్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది. ఇక కొత్త సినిమాలకు కమిట్ అవ్వని తరుణంలో రాజకీయాలకే పరిమితమవుతారా? ఇకపై సినిమాలు చేయరా? అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిమానులు ఓజి 2 అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


