
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు ఓవర్సీస్ లో షోలు రద్దు చేయడంతో పెద్ద సంచలనం సృష్టించింది. నార్త్ అమెరికాలోని ప్రధాన డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ ఈ నిర్ణయం తీసుకుంది.
Key Points
ఓవర్సీస్ లో 'ఓజీ' సినిమా షోలు రద్దు
నార్త్ అమెరికాలోని యార్క్ సినిమాస్ తీసుకున్న నిర్ణయం
ప్రీ-బుకింగ్ టిక్కెట్లకు రిఫండ్
ఓవర్సీస్ లో ‘ఓజీ’ షోల రద్దు
రిలీజ్‌కి రెండు రోజుల ముందు ఓవర్సీస్ మార్కెట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) మూవీకి భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఓజీ షోలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది.
యార్క్ సినిమాస్ ప్రకటన
‘సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రీబుకింగ్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తాం.పబ్లిక్ సెక్యూరిటే మా టాప్ ప్రయారిటీ’ అని యార్క్ సినిమాస్ ఓ ప్రకటన వెల్లడించింది.
భద్రతా ముప్పు కారణంగా నిర్ణయం
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
చివరి నిమిషంలో ‘ఓజీ’ సినిమాకు ఎదురైన ఈ అనూహ్య పరిణామం పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశ పరిచింది. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ విషాదకరమైన సంఘటన చిత్ర యూనిట్‌ను కూడా తీవ్రంగా కలవరపెట్టింది.


