|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అకీరా ఎంట్రీ కోసం పవన్ ప్లాన్! శేఖర్ కమ్ములతో భారీ ప్రయత్నాలు! మెగా ఫ్యాన్స్ షాక్!

Published: 09-02-2026, 11:35 PM
అకీరా ఎంట్రీ కోసం పవన్ ప్లాన్! శేఖర్ కమ్ములతో భారీ ప్రయత్నాలు! మెగా ఫ్యాన్స్ షాక్!
  • అకీరా నందన్ వెండితెర ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులు.
  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకీరా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
  • అకీరా కోసం ప్రత్యేక కథ సిద్ధం చేయమని శేఖర్ కమ్ములను కోరిన పవన్ కళ్యాణ్.
  • నటనలో శిక్షణ, మార్షల్ ఆర్ట్స్, సంగీతంలో ప్రావీణ్యం పొందిన అకీరా నందన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలో వెండితెరకు పరిచయం కానున్నారు. దీని కోసం పవన్ కళ్యాణ్ శేఖర్ కమ్ములను కలిసి ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేయమని కోరినట్లు సమాచారం.

అకీరా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూపులు

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ వెండితెర అరంగేట్రం కోసం మెగా అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. గత కొన్నాళ్లుగా అకీరా ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నా, తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకీరా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చినా, అకీరా నందన్ విషయంలో ఉన్న క్రేజ్ వేరు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, అకీరా ఆరడుగుల ఎత్తు, అతని సంగీత ప్రతిభను చూసిన అభిమానులు.. “జూనియర్ పవర్ స్టార్” ఎప్పుడు వస్తాడా అని ఆరా తీస్తున్నారు.

Read also- Illu Illalu Pillalu Today Episode: విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకీరా లాంచ్?

సాధారణంగా మెగా వారసుల ఎంట్రీ అంటే భారీ మాస్ యాక్షన్ సినిమా ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన కుమారుడి లాంచ్ విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అకీరాను ఒక కంప్లీట్ యాక్టర్గా నిలబెట్టగల దర్శకుడి కోసం వెతుకుతున్న క్రమంలో శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చింది. శేఖర్ కమ్ములను ఎందురు ప్రిఫర్ చేస్తున్నారు అంటే?.. ఆయన సినిమాల్లో హీరో పాత్రలు చాలా సహజంగా, ఎమోషనల్‌గా ఉంటాయి. మొదటి సినిమాతోనే నటుడిగా నిరూపించుకోవడానికి శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ బాగా ఉపయోగపడుతుందని పవన్ భావిస్తున్నారట. ‘హ్యాపీ డేస్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో యూత్‌లో శేఖర్ కమ్ములకు ఉన్న ఇమేజ్ అకీరాకు ప్లస్ అవుతుంది. అకీరా కోసం ఒక స్పెషల్ స్టోరీ లైన్ ఉంటే చెప్పమని శేఖర్ కమ్ములను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

Read also- Intinti Ramayanam Today Episode: తండ్రి కోసం కొడుకులు ప్రయత్నాలు.. రాజేంద్రను చంపేందుకు ప్లాన్..పల్లవి పై అవనికి అనుమానం..

నటనలో శిక్షణ పొందిన అకీరా

అకీరా కేవలం వారసత్వంతోనే కాకుండా, సొంత టాలెంట్‌తో రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే విదేశాల్లో నటనకు సంబంధించిన కోర్సులు చేయడమే కాకుండా, మార్షల్ ఆర్ట్స్, సంగీతంలోనూ శిక్షణ పొందాడు. తండ్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అకీరా సిద్ధమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను ‘మెగా ప్రిన్స్’గా ఇప్పటికే ఓన్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అంటే అది ఖచ్చితంగా ఒక క్లాసిక్ అవుతుందని వారు నమ్ముతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు అకీరా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అకీరా భుజాలపై ఉంది. ఒకవేళ శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ఓకే అయితే, అది టాలీవుడ్‌లో అతిపెద్ద డెబ్యూ ఫిలిం కావడం ఖాయం.

మొత్తానికి అకీరా నందన్ వెండితెర అరంగేట్రం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.