
📌 Key Points
- వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ సందడి, విద్యార్థులతో ముచ్చట్లు!
- త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే యూనివర్సిటీ గురించి తెలిసిందన్న పవన్ కళ్యాణ్.
- యువత ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దని పవన్ కళ్యాణ్ సూచన.
- రాజకీయాల్లో ఓటమికి సిద్దపడే వచ్చానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మాటలతో దుమ్ము రేపారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి చదవండి!
ఆంధ్ర యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ ప్రసంగం!
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా బుధవారం రాత్రి వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ కల్చరల్ ఫెస్ట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ సిబ్బంది, స్టూడెంట్స్ ఘనంగా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. పలు సాంసృతిక కార్యక్రమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్ర విశ్వ విద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విద్యార్థులు దగ్గర మాట్లాడాలంటే నాకు కష్టం. మీరు అన్ని ఆలోచిస్తారు. మీ దగ్గర మనసుతోనే మాట్లాడతాను. నాకు భగవంతుడు యూనివర్సిటీ లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు. చదువుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత లోపలికి వచ్చి మీతో కలిసేలా చేసాడు. యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అని నాకు తెలియడానికి ఇదే ఆంధ్ర యూనివర్సిటీ పాత స్టూడెంట్, నా మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం. ఆయన ఇక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ చేసారు. ఇంత చదివి, కస్టపడిన ఆయన యూనివర్సిటీలు లోపల ఎలా ఉంటాయో, ఇక్కడ ఎలా పనిచేస్తారో నాకు ఆయనే చెప్పారు. యూనివర్సిటీస్ కి రావడానికి నాకు అర్హత లేదు. మేధస్సుతో నేను పోటీ పడలేను. ఇక్కడికి వచ్చేముందు నాకు అర్హత ఉందా లేదా అని ఆలోచించాను కానీ మీరు ప్రేమగా పిలిచారు కాబట్టి వచ్చాను అని అన్నారు.
యువతకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!
అలాగే.. యువత ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు అంటూ నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేయాలి. సినిమా చేసినా వాళ్లకు ఉపయోగపడాలి. ఓటమికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చా. పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు నచ్చకపోతే, నేను చేసే పనులు నచ్చకపోతే తీసి పక్కన పడేయండి అంటూ యువతని ఉద్దేశించి మాట్లాడారు పవన్. దీంతో పవన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


