
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే, సాధారణంగా నెల రోజులకు పైగా థియేటర్లలో ఉండే సినిమా, అంత త్వరగా ఓటీటీలోకి వస్తుందనే వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన తాజా సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Key Points
పవన్ కళ్యాణ్ 'OG' సినిమా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తుందనే వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
'OG' సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తాజా సమాచారం.
సినిమా యూనిట్ లేదా నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
OG సినిమా భారీ వసూళ్లు, అభిమానుల ఆనందం
They Call Him OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఆల్మోస్ట్ 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. OG సినిమాకు వచ్చిన హైప్, ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీక్వెన్స్, సినిమాలో పవన్ స్టైలిష్ లుక్స్, సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం, పవన్ కూడా OG సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(They Call Him OG)
ఇటీవల సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఓటీటీ సంస్థలతో ఉన్న ఒప్పందంతో నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఇంత పెద్ద హిట్ సినిమా కూడా ఇప్పుడు నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుందట.
ఓజీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?
నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ స్ట్రీమింగ్ – నిజమెంత?
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం OG సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీంతో అంత తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. మూవీ యూనిట్ కానీ నెట్ ఫ్లిక్స్ కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ లెక్కన దీపావళి తర్వాత OG సినిమా ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. మరి థియేటర్స్ లో ఫుల్ సౌండ్ చేసిన OG సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.
‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో లేదో చూడాలి. అయితే, అధికారిక ప్రకటన వచ్చేవరకు అభిమానులు వేచి చూడాల్సిందే.


