|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ రిలీజ్ డేట్ ఫిక్స్! బాక్సాఫీస్ షేక్.. రికార్డులు బ్రేక్!

Published: 04-02-2026, 7:05 AM
Breaking: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' రిలీజ్ డేట్ ఫిక్స్! బాక్సాఫీస్ షేక్.. రికార్డులు బ్రేక్!
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్: మార్చి 26, 2026!
  • శ్రీరామ నవమికి ముందే థియేటర్లలో పవన్ కళ్యాణ్ మాస్ జాతర, ఫ్యాన్స్ కి పండగే పండగ!
  • పాన్ ఇండియా మూవీ ‘ధురంధర్ 2’కి ‘ఉస్తాద్’ గట్టి పోటీ, బాక్సాఫీస్ వద్ద భారీ పోరు ఖాయం!
  • ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా మెరుపులు, దేవిశ్రీ మ్యూజిక్ తో దుమ్మురేపడం ఖాయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

మార్చి 26న ‘ఉస్తాద్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న రెండవ సినిమా ఇది. దీనితో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చివరగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ హిట్ కావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చి 26న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా రెడ్ కర్చీఫ్ పట్టుకుని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ అదిరిపోయింది. పాన్ ఇండియా క్రేజీ చిత్రం ధురంధర్ 2 రిలీజ్ అయిన వారం గ్యాప్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతోంది. ధురంధర్ 2 దెబ్బకు పెద్ద పాన్ ఇండియా సినిమాలు పెద్ది, టాక్సిక్ లాంటివి వాయిదా పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ

ఎందుకంటే ఈ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు.. నార్త్ మార్కెట్ చాలా కీలకం. ధురంధర్ కి ఎదురెళ్లి నార్త్ లో వసూళ్లు సాధించడం కష్టం. అందుకే పెద్ది లాంటి సినిమాలు వాయిదా పడబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమా వాయిదా ఇంకా అధికారికంగా కంఫర్మ్ కాలేదు.

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కావాల్సింది రీజినల్ మార్కెట్ మాత్రమే. ఇక్కడ పవర్ స్టార్ కింగ్. కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు అని నిర్మాతలు డిసైడ్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శ్రీరామ నవమి ముందు రోజు ఉస్తాద్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

పవన్ కళ్యాణ్ మాస్ జాతర!

Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD 🕺🤟🏻🙇🏻💥💥 This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN 🔥 #UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026. #UBSOnMarch26th POWER STAR @PawanKalyan … pic.twitter.com/zUJupQR0So

— Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2026

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.