|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Payal Rajput: ఫోన్ నంబర్ షేర్ చేసిన పాయల్.. దయచేసి మీ ఇంటికి తీసుకెళ్లండి అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published: 30-04-2025, 4:52 AM

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తన పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు మంచి ఇళ్ళు వెతుకుతోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన ఫోన్ నంబర్ కూడా షేర్ చేసింది.

Key Points

1

పాయల్ రాజ్‌పుత్ తన పెంపుడు కుక్క పిల్లలకు ఇళ్ళు వెతుకుతోంది.

2

ఆమె తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

3

కుక్క పిల్లల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

4

పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

పాయల్ రాజ్‌పుత్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్ఎక్స్-100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న పాయల్ తన అందం, నటనతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2023లో ఆమె ‘మంగళవారం’(Mangalavaaram) చిత్రంతో వచ్చి ఘన విజయం సాధించింది. ఇక గత ఏడాది ‘రక్షణ (Rakshana)సినిమాలో నటించింది. ప్రస్తుతం ‘వెంకటలచ్చమి’ మూవీతో రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్‌కు ఐదు పిల్లలు పుట్టగా.. వాటిని పెంచుకోవడానికి ఇవ్వడానికి మంచి వ్యక్తులను వెతుకుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ‘‘అందరికీ నమస్కారం. నేను నా పెంపుడు జంతువుల కోసం ప్రేమించే ఇండి కోసం వెతుకుతున్నాను. శునక ప్రేమికులారా.. మీరు వాటికి శ్రద్ధగల వాతావరణాన్ని అందించగలిగితే దయచేసి నన్ను సంప్రదించండి.. ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా నంబర్: (9989994666) ను కూడా పోస్ట్‌లో యాడ్ చేసింది. అలాగే తన కుక్క పిల్లల ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కుక్క పిల్లలకు ఇళ్ళు వెతుకుతోంది

వైరల్ అవుతున్న పోస్ట్

పాయల్ రాజ్‌పుత్ యొక్క ఈ మంచి చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుక్క ప్రేమికులు ఆమెను సంప్రదిస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.