|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్దపల్లిలో పెన్షన్ యుద్ధం: ప్రభుత్వ ఉద్యోగుల సన్నాహక సభ! పాత పెన్షన్ కోసం పోరు!

Published: 12-03-2026, 2:05 AM
పెద్దపల్లిలో పెన్షన్ యుద్ధం: ప్రభుత్వ ఉద్యోగుల సన్నాహక సభ! పాత పెన్షన్ కోసం పోరు!
  • పెద్దపల్లిలో సీపీఎస్ ఉద్యోగుల సన్నాహక సమావేశం జరిగింది.
  • సీపీఎస్ విధానంలో రిటైర్మెంట్ ల సంఖ్య పెరుగుతోందని ఉద్యోగుల ఆందోళన.
  • పాత పెన్షన్ విధానం (OPS) తమ హక్కు అని ఉద్యోగుల స్పష్టీకరణ.
  • ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని ఉద్యోగుల పిలుపు.

పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్ సన్నాహక సమావేశం జరిగింది. సీపీఎస్ విధానం వలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, పాత పెన్షన్ విధానం కోసం పోరాడాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు.

సీపీఎస్ విధానంపై ఉద్యోగుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్ లో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో సిపీఎస్ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ హాజరయ్యారు.

పాత పెన్షన్ సాధనే లక్ష్యంగా ఉద్యమం

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ… సీపీఎస్ (CPS) విధానంలో రిటైర్మెంట్ ల సంఖ్య రోజు రోజు కు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,316 రిటైర్ అయ్యారని…. వారికి ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ కేవలం 3000 లోపు మాత్రమే అని వాపోయారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ జీవితం అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యోగులు కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకోగలమని వారు స్పష్టం చేశారు.

ఉద్యోగుల ఐక్య పోరాటాలకు పిలుపు

టి.ఎన్. జి.ఓ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ… ​ఉద్యోగులు విభేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావాలన్నారు.​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ “పాత పెన్షన్ (OPS) మన హక్కు-అది భిక్ష కాదు” అని స్పష్టం చేశారు. దీనిని సాధించుకునే వరకు విశ్రమించే ప్రసక్తి లేదన్నారు.

పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.