
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది.
- ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా.
- మెగా అభిమానులు ‘పెద్ది’ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- సినిమా విడుదల వాయిదా పడటంతో నిరాశలో అభిమానులు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల వాయిదా పడింది. దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు.
పెద్ది సినిమా విడుదల వాయిదాకు కారణం ఏమిటి?
Peddi Movie: మెగా అభిమానులు రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతుంది. ఈ నేపథ్యంలోనే చరణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan)ఇటీవల శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో చరణ్ అభిమానులు పెద్ది సినిమా(Peddi Film) పైన ఆశలు పెట్టుకున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని ముందుగా మార్చి 27 తేదీ విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చిన విధంగానే ఈ సినిమాని మార్చి 27 నుంచి ఏప్రిల్ 30 తేదీకి వాయిదా వేశారు. షూటింగ్ పూర్తి కానీ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది.
మెగా అభిమానుల నిరాశ
ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వడానికి మరింత సమయం పడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఇలా పెద్ది సినిమా ఏప్రిల్ 30 వ తేదీ వాయిదా పడుతుందంటూ వార్తలు రావడంతో ఈ తేదీన నిఖిల్ స్వయంభు సినిమాని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా పెద్ది సినిమా మళ్లీ వాయిదా పడుతోంది అంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్..
తదుపరి విడుదల ఎప్పుడు?
ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడితే తదుపరి సినిమా ఎప్పుడు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో నిరాశ చెందుతున్నారు ఇక ఈ సినిమాపై మాత్రం భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ అలాగే ఫస్ట్ సింగిల్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా కుషిత కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఇందులో జగపతిబాబు వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో నటిస్తున్నారు.
పెద్ది సినిమా విడుదల వాయిదా పడటం మెగా అభిమానులను నిరాశపరిచింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


