|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది! రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

Published: 06-01-2026, 5:00 AM
పెద్ది సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది! రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో ‘పెద్ది’ సినిమా రూపొందుతోంది.
  • జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
  • ‘పెద్ది’ సినిమా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
  • విడుదల వాయిదాపై వచ్చిన పుకార్లను తోసిపుచ్చిన మేకర్స్, అధికారిక ప్రకటన చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సినిమా వాయిదా పడుతుందని వచ్చిన వార్తలను మేకర్స్ తోసిపుచ్చారు. మార్చి 27న సినిమా విడుదల ఖాయమని అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ది: భారీ బడ్జెట్, భారీ తారాగణం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’(peddi). గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో అత్యంత హైప్ ఉన్న ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, సాంగ్ ఊహించని రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.

అయితే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో అవి చూసిన మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలో.. నేడు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆయనకు విషెస్ తెలిపారు. అంతేకాకుండా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. ‘‘చికిరి చికిరి’ పాట కేవలం ఆరంభం మాత్రమే.. రాబోయే పాటల్లో రెహమాన్ మ్యాజిక్ మరింత గట్టిగా వినిపించబోతోంది” అనే క్యాప్షన్ జత చేస్తూ.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ‘పెద్ది’ అనుకున్నట్లుగానే మార్చి 27న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అంతా ఆనందపడుతున్నారు.

విడుదల వాయిదాపై సందిగ్ధతకు తెర

మెగా ఫ్యాన్స్‌కు అద్భుతమైన వార్త!

‘పెద్ది’ విడుదల వాయిదాపై వచ్చిన పుకార్లకు తెరదించి, మేకర్స్ ఇచ్చిన స్పష్టమైన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం రావడం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.