|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన: న్యాయమూర్తికే పిటిషనర్ ఆదేశాలు, తీవ్ర హైడ్రామా!

Published: 10-07-2026, 5:32 PM
సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన: న్యాయమూర్తికే పిటిషనర్ ఆదేశాలు, తీవ్ర హైడ్రామా!
  • సుప్రీంకోర్టులో పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ తీవ్ర హైడ్రామా సృష్టించాడు.
  • న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసభ్య పదజాలంతో దూషించాడు.
  • కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా ధర్మాసనం సంయమనం పాటించింది.
  • మానసిక ఆందోళనలో ఉన్నాడని భావించి, పిటిషన్ కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వచ్చిన ఓ పిటిషనర్, విచారణ సందర్భంగా న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హైడ్రామా సృష్టించాడు. కోర్టు ధిక్కరణకు పాల్పడినా, ధర్మాసనం సంయమనంతో వ్యవహరించింది.

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన

అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో శుక్రవారం తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. విచారణకు స్వయంగా హాజరైన ఓ పిటిషనర్, న్యాయమూర్తుల ధర్మాసనం వైపు కాగితాలను విసిరేసి, అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కోర్టు హాల్ నుండి బయటకు తీసుకువెళ్లారు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ ఘటన జరిగింది. ప్రబల్ ప్రతాప్ అనే పిటిషనర్ వాదనలు ప్రారంభిస్తూ దూకుడుగా..‘మిస్టర్ జుడీషియల్ సర్వెంట్.. నేనే సార్వభౌమాధికారిని. సైబర్ నేరాల సిండికేట్ నడుపుతున్న లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను’ వ్యాఖ్యానించాడు. పిటిషనర్ ప్రవర్తనకు షాకైన జస్టిస్ విశ్వనాథన్.. ‘‘నువ్వు మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’’ అని ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ.. ‘నా వైపు నుండి చెప్పాల్సింది ఇంతే. అంతా రికార్డుల్లో ఉంది’ అంటూ ఆగ్రహంతో.. కేసు పేపర్లను గాల్లోకి విసిరేసి, కోర్టును దూషించాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆయనను బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఉద్దేశిస్తూ.. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించాడు. ‘ఈ పేపర్లు తీసుకుపోయి మీ సీజేఐకి ఇవ్వండి’ అంటూ దుర్బాషలాడాడు.

సాధారణంగా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిడే కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశిస్తారు. అయితే ఈ కేసులో ధర్మాసనం ఎంతో సంయమనంతో, దయాగుణంతో వ్యవహరించింది. పిటిషనర్ ప్రబల్ ప్రతాప్‌పై ఎలాంటి చట్టపరమైన, ధిక్కార చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. విచారణ ప్రారంభమైనప్పుడు పిటిషనర్ కేసును వాదించకుండా, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ, పిటిషనర్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గమనించి, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాము భావించడం లేదని ధర్మాసనం ఉదారంగా వ్యాఖ్యానించింది. కాగా.. ఇక కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ సదరు పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

పిటిషనర్ దూషణలు, కోర్టు సంయమనం

పిటిషన్ కొట్టివేత: కారణాలు

ఈ ఘటన న్యాయవ్యవస్థలో అరుదైన సంఘటనగా నిలిచింది. పిటిషనర్ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వ్యవహరించి, న్యాయమూర్తుల సంయమనాన్ని ప్రదర్శించింది. ఇది న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.