|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ రహస్య కారణాలు తెలుసా?

Published: 27-07-2026, 2:35 PM

స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో, బ్యాటరీ త్వరగా అయిపోవడం చాలామందికి సమస్య. బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు, అధిక బ్రైట్‌నెస్, సిగ్నల్ సమస్యలు వంటి చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

Key Points

1

బ్యాగ్రౌండ్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకం బ్యాటరీని త్వరగా తగ్గిస్తాయి.

2

స్క్రీన్ బ్రైట్‌నెస్ అధికంగా ఉంటే చార్జింగ్ త్వరగా అయిపోతుంది.

4

GPS, వై-ఫై, బ్లూటూత్ అవసరం లేనప్పుడు ఆఫ్ చేయాలి.

బ్యాగ్రౌండ్ యాప్స్ ప్రభావం

ఇప్పుడందరూ దాదాపు స్మార్ట్‌ఫోనే వాడుతున్నారు. కాల్స్ మాట్లాడటానికే కాకుండా సోషల్ మీడియాను స్క్రోల్ చేయడానికి, రీల్స్ చేయడానికి, వీడియోలు వీక్షించడానికి ఫోనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే చార్జింగ్ అయిపోయి బ్యాటరీ డౌన్ అయ్యే సమస్యను కూడా ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇది సాధారణకంటే ఎక్కువగా జరిగితే మాత్రం కొన్ని ప్రత్యేక కారణాలు ఉండి ఉంటాయి అంటున్నారు సాంకేతిక నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*బ్యాగ్రౌండ్ యాప్స్ ప్రభావం: ఫోన్లలో కొన్నిసార్లు తాత్కాలిక అవసరం కోసం యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు చాలా మంది. అయితే తర్వాత వీటిని డిలీట్ చేయకపోవడం, అవి బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉండటం వంటి కారణాలవల్ల చార్జింగ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గూగుల్ మ్యాప్స్, ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించడం కూడా త్వరగా చార్జింగ్ అయిపోయేందుకు కారణం అవుతాయి. అలా జరగకూడదంటే బ్యాగ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఆఫ్ చేయాలని, అవసరం లేని వాటిని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రైట్‌నెస్, సిగ్నల్ సమస్యలు

*బ్రైట్‌నెస్ అధికంగా ఉన్నప్పుడు : సాధారణంగా మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ అధికంగా ఉన్నా కూడా మీ ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంది. బ్యాటరీ డౌన్ అవుతుంది. కాబట్టి ఆటో బ్రైట్‌నెస్ ఆన్‌లో ఉంచడం లేదా మాన్యువల్ బ్రైట్‌నెస్ 40 శాతం లోపల ఉంచడం మీ బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేస్తుంది.

*సిగ్నల్ ప్రాబ్లం : నెట్‌వర్క్ లేకపోవడం లేదా సిగ్నల్ ప్రాబ్లం కూడా మీ ఫోన్ బ్యాటరీని ఎక్కువ వినియోగించుకునేందుకు కారణం అవుతుంది. దీంతో చార్జింగ్ చాలా త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్‌చేసి పెట్టుకోవడంవల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. నెట్వర్క్ పరిధిలోకి వచ్చాక మళ్లీ ఎయిర్ ప్లేన్ మోడ్ తీసేస్తే సరిపోతుంది.

GPS, వై-ఫై, నోటిఫికేషన్లు

*జీపీఎస్, వై-ఫై : అట్లనే కొన్నిసార్లు బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై వంటి కొన్ని ఫీచర్లు, యాప్‌లు అవసరం లేకపోయినా ఆన్‌లో ఉండి రన్ అవుతుంటాయి. ఇవి బ్యాటరీని త్వరగా డౌన్ చేస్తాయి. కాబట్టి చార్జింగ్ త్వరగా అయిపోతుంది. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఇంట్లో లేకపోతే బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్‌లో పెట్టుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. దీంతోపాటు అనవసరమైన నోటిఫికేషన్లు ఆన్‌లో ఉండటం, ఎక్కువసేపు.. అంటే 100% వచ్చేవరకు చార్జింగ్ పెట్టడం వంటివి బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తాయి. ఎప్పుడూ 80% వరకు మాత్రమే చార్జింగ్ ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు.

ఈ సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు. అనవసరమైన వినియోగాన్ని తగ్గించి, సరైన అలవాట్లతో మీ ఫోన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.