|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: విజయ్, రష్మిక పెళ్లికి మోదీ ఆశీస్సులు! VIROSH లవ్ స్టోరీకి గ్రాండ్ వెల్కమ్!!

Published: 25-02-2026, 1:35 AM
  • విజయ్, రష్మికల పెళ్లికి ప్రధాని మోదీ ఆశీస్సులు – వైరల్ అవుతున్న లేఖ!
  • ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా VIROSH పెళ్లి వేడుక!
  • ప్రేమ, అనురాగాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మోదీ ఆకాంక్ష!
  • విజయ్ తల్లిదండ్రులకు ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని నరేంద్ర మోదీ.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంటను ఆశీర్వదించడంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ ఆశీస్సులతో VIROSH పెళ్లి వేడుక!

కొద్దిగంటల్లో పెళ్లిపీటలెక్కబోతోన్న నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకకు తనను ఆహ్వానించిన విజయ్ తల్లిదండ్రులకు ఆయన లేఖ రాశారు. ఈ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ – రష్మికల వివాహ వేడుక ఆహ్వానం అందుకోవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు మోదీ. వారి జీవితంలో ఇది అందమైన, కొత్త అధ్యాయానికి నాంది అని, సప్తపది పవిత్ర సంప్రదాయంతో జీవితాంతం స్నేహితులుగా, దంపతులుగా అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదించారు. సినిమాల్లోనే కాకుండా.. నిజజీవితంలోనూ వారిద్దరూ ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని అందంగా నిర్మించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని, విజయ్ – రష్మికల జీవితం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా.. రేపు (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లో విజయ్ – రష్మిక (VIROSH?) పెళ్లివేడుక ఘనంగా జరుగనుంది.

విజయ్ తల్లిదండ్రులకు ప్రధాని ప్రత్యేక లేఖ!

ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో పెళ్లి!

ప్రధాని మోదీ స్వయంగా ఈ జంటను ఆశీర్వదించడంతో ఈ వార్త సంచలనంగా మారింది. VIROSH పెళ్లికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.