లిక్కర్ పాలసీ కేసులో ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఆయనకు సుప్రీంకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో కొందరు అప్రూవర్‌గా మారడంతో కొందరు విడుదలయ్యారు. కీలక నిందితులుగా భావిస్తున్నమాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే కవితకు బెయిల్ వచ్చింది.
తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంతైంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. దాదాపు ఆరునెలల తర్వాత ఈ కేసులో తీహార్ జైలు నుంచి ఆయన బయటకు రానున్నారు.