హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణపయ్యలకు వీడ్కోలు పలుకుతున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ఈ సందర్భంగా పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. చిన్నపిల్లల నుండి యువతీ యువకులు, మహిళలు గణనాథుల నిమజ్జనంలో డప్పుదరువులకు స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. Hyderabad నగరం మొత్తం ఉత్సవ కోలాహలంతో నిండిపోయింది.
ఇక, గణేశ్ నిమజ్జన వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఏర్పాటు చేసిన గణపతిని కూడా నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి మనవడు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తున్న వాహనం ముందు రేవంత్ మనవడు డప్పుల దరువులకు అనుగుణంగా అందంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి, కూతురు అతని డ్యాన్స్ చూసి మురిసిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.