ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan) తిరుమల తిరుపతికి చేరుకున్నారు. మొదట గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడకన పవన్ కల్యాణ్ తిరుమల కొండపైకి వెళ్తున్నారు. కాగా రేపు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అలాగే మూడు రోజుల పాటు ఆయన తిరుపతిలోనే పర్యటించనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం తిరుమల కొండపైకి పవన్ కాలినడకన వెళ్తుండటంతో.. నడక మార్గంలో కోలాహలం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూనే.. కొండపైకి నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఓటీటీలో ‘గొర్రె పురాణం’
Share this… Facebook Twitter Whatsapp Linkedin సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం…
Read more