హైడ్రా దూకుడుగా వెళ్తుంది. ఎవరున్న తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఈ మధ్యే సీని హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు తాజాగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వీటిలో పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. . తన ఫ్యామిలీ కబ్జా చేసినా.. కూల్చివేయిస్తానని అన్నారు సీఎం రేవంత్.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
Share this… Facebook Twitter Whatsapp Linkedin మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు…
Read more