హీరో అక్కినేని నాగార్జున కుటుంబం(Hero Akkineni Nagarjuna family)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి రోజా(Former Minister of AP Roja) ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి సమంత(Actress Samantha)పై కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె మండిపడ్డారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ (Brs Party) అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందని రోజా చెప్పారు. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గమని, ఆ పని మహిలే చేయటం మరింత బాధిస్తోందని చెప్పారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అధిగమిస్తుందని తాను ఆశిస్తున్నానని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు.
మా నాన్న సూపర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్
Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూపర్ హీరో; నటీనటులు: సుధీర్ బాబు,…
Read more