టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో విజయవంతంగా కనిపిస్తుండడం మాత్రమే కాకుండా, రాజకీయాల్లోనూ దూసుకెళ్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో ఈమె హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ తరపున ప్రచారం చేయడం, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేయడం వంటివి చేస్తూ, టీడీపీ, జనసేన నేతల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ఆమెను చంపేస్తామని బెదిరింపులకు గురిచేసారు. అయితే, ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ వెన్నంటనే నిలిచింది. జగన్ కోసం చేసిన కష్టానికి ఆమెకు ప్రతిఫలం లభించింది.
తాజాగా, వైసీపీ చీఫ్ జగన్ శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు జూపూడి ప్రభాకర్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే Roja ను అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. అలాగే, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయ సలహా కమిటీ సభ్యుడిగా నియమించారు