ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి(Former Ongole MLA Balineni Srinivasulareddy) జనసేనలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (AP Deputy CM, Janasena Party chief Pawan Kalyan) సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. బాలినేనితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను(Former MLA Samineni Udayabhanu), కిలారు రోశయ్య ( Ex Mla Kilaru Roshaiah), ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు సైతం పవన్ సమక్షంలో జనసేన జెండా కప్పుకున్నారు. గతంలో వీరంతా వైసీపీలో కీలకంగా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత పార్టీలో ప్రధాన్యత తగ్గడంతో బాలినేని, ఉదయ భాను, రోశయ్య వైఎస్సార్ కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన చేరుతామని చెప్పారు. తాజాగా మంగళగిరి జనసేన కార్యాలయం(Mangalagiri Janasena office)లో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలం పెరిగింది.
Controversy Over Pawan Kalyan’s Children’s Religious Affiliation
Share this… Facebook Twitter Whatsapp Linkedin Pawan Kalyan’s Struggle to Uphold…
Read more