మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న సురేశ్‌ను కలవనున్నారు. ఈ మేరకు ములాఖత్ తీసుకున్నారు. కాసేపట్లో జైలు వద్దకు జగన్ వెళ్లనున్నారు. ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్ట్‌ను జగన్ ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా నందిగంపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు వద్దకు వైసీపీ నాయకులు భారీగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
Share this… Facebook Twitter Whatsapp Linkedin మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు…
Read more