
📌 Key Points
- ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి సందడి చేసింది.
- ప్రభాస్, హియా దాసరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- ప్రభాస్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని హియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి ప్రభాస్‌తో చేసిన సంభాషణ వీడియో ఎంతగానో వైరల్ అవుతోంది. ఈ అందమైన దృశ్యాలపై అభిమానులు ఫిదా అవుతున్నారు.
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలైట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్ బాహుబలి, కల్కి, సలార్ లాంటి అద్భుతమైన పాన్ ఇండియా చిత్రాల్లో నటించారు. కానీ ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ చూసి చాలా ఏళ్ళు గడిచిపోతోంది.
చివరగా డార్లింగ్ చిత్రంలోనే ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు ఎంజాయ్ చేశారు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో రాజా సాబ్ చిత్రంలో వినోదం అందించబోతున్నారు. పండగ సీజన్ లో ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
మారుతి కుమార్తె హియా కామెంట్స్: వీడియో వైరల్
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. డైరెక్టర్ మారుతి కుమార్తె హియా దాసరి ప్రభాస్ తో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ దృశ్యాలని హియా స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ప్రభాస్ కూర్చుని ఉండగా వెనుక నుంచి వచ్చిన హియా అతడిని పలకరించింది. దీనితో ప్రభాస్ తో అంతే ప్రేమగా మారుతి డాటర్ ని రిసీవ్ చేసుకుని మాట్లాడారు. ఈ అందమైన దృశ్యాలని అభిమానులు వైరల్ చేస్తున్నారు. హియా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. హీరో గారు.. మీరు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ పోస్ట్ చేసింది.
ప్రభాస్ అభిమానుల ఆనందం: సోషల్ మీడియాలో రచ్చ
తన కుమార్తె పోస్ట్ పై మారుతి కూడా రియాక్ట్ అయ్యారు. లవ్ ఎమోజీలు పెట్టారు. నిధి అగర్వాల్ కూడా రియాక్ట్ అయింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
A post shared by Hiya Dasari (@hiyadasari_)
ప్రభాస్ మంచితనాన్ని చాటిన ఈ వీడియో ‘రాజా సాబ్’ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పండగకు విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.


