|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రెండింగ్ లో ప్రభాస్ పెళ్లి.. ఆ ముహూర్తం ఎప్పుడు? ఆ లక్కీ లేడీ ఎవరంటే? పెద్దమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

Published: 11-08-2025, 10:16 AM
ట్రెండింగ్ లో ప్రభాస్ పెళ్లి.. ఆ ముహూర్తం ఎప్పుడు? ఆ లక్కీ లేడీ ఎవరంటే? పెద్దమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల చేసిన కామెంట్లు ఈ చర్చను మరింత రసవత్తరంగా మార్చాయి. ఆమె పెళ్లి గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాం.

Key Points

1

ప్రభాస్ పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలా దేవి కీలక వ్యాఖ్యలు

2

పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఇంకా నిర్ధారణ లేదు

4

అనుష్క, కృతిసనన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి

శ్యామలా దేవి కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ పెళ్లెప్పుడు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దాని కంటే పెద్ద ప్రశ్న ఇది. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడో అనే దానికి సమాధానం దొరికింది. కానీ ప్రభాస్ కల్యాణ ఘడియలు మాత్రం ఇంకా రాలేదు. అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలా దేవి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందన్నారు. శ్రావణమాసం నేపథ్యంలో ద్రాక్షారామంలోని భీమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శ్యామలా దేవి సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని చెప్పారు.

పెళ్లి తేదీ రహస్యం

‘‘ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. పూజలు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. స్వామికి భక్తితో నమస్కరిస్తే మనకేం కావాలో ఆయనే ఇస్తారు. ప్రభాస్ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. తప్పకుండా బాబుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం. ఎప్పుడు అనేది చెప్పలేను. శివుడి ఆజ్ణ లేనిదే చీమైన కుట్టదంటారు. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ భగవంతుడి ఆజ్ణ కోసం చూస్తున్నాం’’ అని శ్యామలా దేవి చెప్పారు.

ప్రభాస్ కు కాబోయే భార్య ఇంకా ఎవరో తెలియదని శ్యామలా దేవి అన్నారు. ‘‘ప్రభాస్ పెళ్లి శుభ సమయం తప్పకుండా వస్తుంది. ఈ ఏడాదైనా కావొచ్చు లేదంటే వచ్చే ఏడాది జరగొచ్చు. అయితే పెళ్లి కూతురు సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయా? లేదా ఫ్యామిలీ సభ్యురాలా? అన్నది ఇంకా తెలియదు’’ అని ప్రభాస్ పెద్దమ్మ తెలిపారు.

కాబోయే వధువు ఎవరు?

ప్రభాస్ పెళ్లి టాపిక్ వినబడగానే ముందుగా అనుష్క పేరే గుర్తుకొస్తోంది. ఎందుకంటే వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో జోరుగా సాగుతోంది. వీళ్లి పెళ్లి డేట్ ఇదేనంటూ రూమర్లు వేరే లెవల్ కు కూడా చేరాయి. ఇక కృతిస‌న‌న్‌ తో ప్రభాస్ లవ్ లో ఉన్నారనే మరో ప్రచారం కూడా ఉంది. వీళ్లిద్దరూ కలిసి ఆదిపురుష్ సినిమాలో యాక్ట్ చేశారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య కూడా ప్రభాస్ నుంచి కృతిస‌న‌న్‌ పేరు తెప్పించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కల్కి సినిమాతో మరోసారి అదరగొట్టారు. రీసెంట్ గా కన్నప్ప మూవీలో నందీశ్వరుడి రోల్ చేశారు. ఇక రాజాసాబ్ అంటూ ఆడియన్స్ ను మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.