|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అభిమానులు ఆశించే దానికన్నా ఎక్కువ ఇస్తా.. ప్రభాస్ సినిమాపై హైప్ పెంచేసిన డైరెక్టర్

Published: 08-06-2025, 12:14 PM
అభిమానులు ఆశించే దానికన్నా ఎక్కువ ఇస్తా.. ప్రభాస్ సినిమాపై హైప్ పెంచేసిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుంది. దర్శకుడు మారుతి తన వ్యాఖ్యలతో సినిమాపై హైప్‌ను మరింత పెంచారు.

Key Points

1

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ‘ది రాజా సాబ్’ సినిమా

2

జూన్ 16న టీజర్ విడుదల

4

అభిమానులు ఆశించే దానికన్నా ఎక్కువ అందిస్తున్నట్లు దర్శకుడు హామీ

‘ది రాజా సాబ్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాను బిగ్ స్క్రిన్‌సై చూసేందుకు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ‘రాజాసాబ్’ డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్లు.. అలాగే టీజర్ జూన్ 16న రాబోతున్నట్లు రీసెంట్‌గా అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దర్శకుడు మారుతి అంచనాలను పెంచుతున్న వ్యాఖ్యలు

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి సినిమా గురించి మాట్లాడుతూ మరింత ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు. ‘ఇంతవరకు అసలు ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు.. ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. ఎందుకంటే.. నేను కాదు నా పని మాట్లాడాలి అనుకున్నాను.. అందుకే దీని గురించి ప్రస్తావించలేదు. ఫ్యాన్స్.. మీరు నా దగ్గర నుంచి, ప్రభాస్ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో.. దానికి మించి 1% ఎక్కువే ఇస్తాను అందులో డౌట్ లేదు. ఇప్పటి వరకు ఆయనపట్ల మీకు ఉన్న ప్రేమను చూశాను.. జూన్ 16న రాబోతున్న టీజర్‌తో ప్రభాస్ పట్ల నాకున్న ప్రేమను మీరు చూస్తారు.. రాజులకే రాజు.. ప్రభాస్ రాజు’ అని తెలిపారు.

సినిమా విడుదల తేదీ మరియు అంచనాలు

“ Fans em expect chesthunnaro, Anthakante 1% ekkuve isthanu andulo doubt ye ledhu “ The king sized @DirectorMaruthi expresses his love and admiration for #Prabhas and guarantees hysteria with #TheRajaSaab teaser on June 16th 💥💥 #TheRajaSaabTeaser #TheRajaSaabOnDec5th pic.twitter.com/JVLW1Qbglo

‘ది రాజా సాబ్’ సినిమాపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. దర్శకుడు ఇచ్చిన హామీతో అంచనాలు మరింత పెరిగాయి. జూన్ 16న విడుదలయ్యే టీజర్‌తో సినిమాపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.